'మర్యాద రామన్న' కథ ఇదే: దర్శకుడు రాజమౌళి
"పాత కక్షల నేపథ్యంలో తను కనిపిస్తే చంపేద్దామని ఎదురుచూస్తున్న విలన్ ఇంటికే హీరో అతిథిగా వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్నంతసేపూ అతను అతిథి దేవుడే. గుమ్మం దాటితే శత్రువు. విలన్ ఇంట్లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? అక్కడి నుంచి బయటపడ్డాడా లేదా అనే విషయం వినోదాత్మకంగా చెబుతున్నాం. హింస, రక్తపాతం లాంటివి మచ్చుకైనా కనిపించవు. నేనే పూర్తిగా సునీల్ శైలిలోకి మారి తీసిన సినిమా ఇది" అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం. షూటింగ్ ముగింపు దశకు చేరుకొంది. శనివారం హైదరాబాద్‌లో చిత్రం యూనిట్ మీడియాతో ఈ చిత్రం విశేషాలను వివరించింది.


Click it and Unblock the Notifications











