అందుకే అలియాను ఎంచుకున్నా.. ఆమె కోసం ఎదురుచూస్తున్నా.. దర్శకధీరుడి కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించినా, ఏ పాత్రకు ఎవరినీ ఎంచుకున్నా.. ఒకటికి వందసార్లు ఆలోచించే చేస్తాడు. ఈ విషయం ఆయన తెరకెక్కించిన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. ఆ పాత్రను వారు తప్ప ఇంకెవరూ పోషించలేరేమో అనేట్టుగా నటించేట్టు చేస్తాడు రాజమౌళి. ప్రతీ పాత్ర, ప్రతీ సీన్‌ను దగ్గరుంచి మరీ చేయించి చూపిస్తాడు జక్కన్న. అందుకే అంత క్లారిటీ, అంత స్పష్టత ఉంటుంది ఆయన తెరకెక్కించే సినిమాలో. తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం అలియాను ఎందుకు తీసుకున్నాడనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

భారీ అంచనాల నడుమ..

భారీ అంచనాల నడుమ..

బాహుబలి వంటి చిత్రాలతో భారతీయ చిత్ర సీమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు రాజమౌళి. మనదేశం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన జక్కన్న.. మరోసారి అలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేయబోతోన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్‌తో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామరాజు కోసం భీమ్

రామరాజు కోసం భీమ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం మొత్తం కరోనాతో పోరాడుతూ ఉన్నా.. ఆర్ఆర్ఆర్ టీజర్ మాత్రం దుమ్ములేపింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించడం, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ వినిపించడం అందర్నీఆకట్టుకుంది. మోషన్ పోస్టర్, టైటిల్, అల్లూరి పాత్ర టీజర్ ఇలా ప్రతీ ఒక్కటి అంతకంతకూ అంచనాలు పెంచేశాయి.

 ఆమె కోసం ఎదురుచూస్తున్నా..

ఆమె కోసం ఎదురుచూస్తున్నా..

రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా నటిస్తుందని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అలియా కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్దమైంది. మార్చి నెలలోనే అలియా భట్ ఎంటర్ కావాల్సిందని, అయితే కరోనా కారణంగా అంతా తారుమారైందని జక్కన్న వివరించాడు. ఆమెతో పని చేయడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి.. ఇంకా అనేక విషయాలను వెల్లడించాడు.

Recommended Video

RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
అందుకే అలియాను ఎంచుకున్నా..

అందుకే అలియాను ఎంచుకున్నా..

హీరోయిన్‌గా అలియాను ఎంచుకోవడం వెనుకున్న కారణాన్ని రాజమౌళి చెబుతూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ధీటైన నటులకు సమానంగా నటించాలని, అంతేకాకుండా అమాయకత్వం, తెగువ ప్రదర్శించే ధీశాలి అయి ఉండాలి.. అవన్నీ అలియాలో ఉన్నాయని ఆమెను తీసుకున్నానని వివరించాడు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X