twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ కోసం స్పెషల్‌గా ఫోలే కళాకారుడు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న దర్శకుడు రాజమౌళి....ఈ చిత్రం కోసం ఫోలే కళాకారుడిని కూడా తీసుకుంటున్నారట. ఇంతకీ ఈ ఫోలే కళాకారులు ఏం చేస్తారనేగా మీ డౌట్. సినిమాలో ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్టులు రాబట్టడానికి వీరు పని చేస్తారు.

    హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన ప్రముఖ ఇంటర్నేషనల్ ఫోలే ఆర్టిస్ట్ ఫిలిపె వాన్ లీర్‌ ‘బాహుబలి' చిత్రానికి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి రాజమౌళి పర్ ఫెక్ట్ నెస్ తేవడానికి ఎంత మేర కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 175 కోట్ల మేర ఖర్చు పెడుతున్నారు.

    Rajamouli Ropes A Foley Artiste For Baahubali

    ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. 2015 వేసవిలో తొలి భాగం వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.

    ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Director SS Rajamouli has roped a Foley artiste for his upcoming movie Baahubali. The flick is often being spot lighted and has created ripples in Tollywood. It is the much awaited movie of Prabhas after his earlier movie Mirchi which collected good at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X