రాజమౌళి వల్ల కన్‌ఫ్యూజన్‌లో పడ్డ ముగ్గురు స్టార్ హీరోలు.. ఎటూ తేల్చుకోలేక...
ప్రస్తుతం రాజమౌళి కారణంగా ముగ్గురు హీరోలు భవిష్యత్తు ప్రాజెక్టులపై ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సాధారణంగా ఏ దర్శకుడైన సరే హీరోతో కొన్ని డేట్స్ అనుకుంటే ప్లాన్ ప్రకారం సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తారు. కానీ రాజమౌళి దగ్గర ఉంటే హీరో అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఒక విధంగా హీరోలు కూడా రాజమౌళి ఛాన్స్ ఇస్తే ఎన్నేళ్ళయినా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వేరే పని పెట్టుకోరు కాబట్టి డేట్స్ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు.
Recommended Video

బలమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
అయితే ఇటీవల కరోనా దెబ్బకు ఆయనను నమ్ముకున్న హీరోలు భవిష్యత్తు ప్రాజెక్టులపై ఒక బలమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. RRR షూటింగ్ మొదలైనా కూడా పూర్తయ్యే సరికి ఆరు నుంచి ఏడు నెలల వరకు ఎక్కువ సమయం పట్టవచ్చని ఇటీవల రాజమౌళి వివరణ ఇచ్చారు. ఆయన అలా అన్నారు అంటే విడుదలకు ఏడాది సమయం కూడా పట్టవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.

RRR పూర్తయితే గాని..
ఇక RRR నటిస్తున్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తరువాత సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. ఒక విధంగా తారక్ త్రివిక్రమ్ తో చేయడానికి రేడిగానే ఉన్నప్పటికీ RRR పూర్తయితే గాని కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టె అవకాశం లేదు. మరోవైపు చరణ్ అయితే కనీసం కొత్త ప్రాజెక్టును కూడా ఎనౌన్స్ చేయలేదు.

మహేష్ బాబు పరిస్థితి మరోలా ఉంది.
వీలైనంత వరకు RRR పై క్లారిటీ వచ్చిన తరువాతనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నాడు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితి మరోలా ఉంది. రాజమౌళితో RRR తరువాత ఒక సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను మహేష్ 6నెలల లోపే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు టాక్.

అందరికి ఒక క్లారిటీ రావాలి అంటే..
ఇక రాజమౌళి RRR కోసం మరో ఏడాదైనా సమయం తీసుకుంటాడు కాబట్టి ఆ మిగతా టైమ్ లో మరో సినిమా చేయాలా లేక రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేయాలా అనేది ఇప్పుడు సూపర్ స్టార్ ని ఆలోచనలో పడేసినట్లు టాక్. మొత్తంగా ముగ్గురు హీరోలు RRR పైన ఆధారపడి నెక్స్ట్ ప్రాజెక్టులపై ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఈ విషయంలో అందరికి ఒక క్లారిటీ రావాలి అంటే కరోనా తగ్గే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











