రాజమౌళితో అరవింద్ మంతనాలు: 3డిలో అల్లు అర్జున్!
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ రేంజిని ఇండస్ట్రీలో మరింత పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన ప్రముఖ దర్శకుడు రాజమౌళితో అరవింద్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అరవింద్ మంతనాలు ఫలించాయని, త్వరలోనే రాజమౌళి-అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.
రాజమౌళి-అల్లు అరవింద్ కాంబినేషన్లో సినిమా 'బాహుబలి' తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని 3డిలో తీయాలని ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు. 'బాహుబలి' 3డిలో వస్తుందని అనుకున్న అభిమానులకు కూడా నిరాశే ఎదురైంది.

అయితే ఈ సారి తన అభిమానుల కోరికను తీర్చేందుకు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాను 3డిలో తెరకెక్కించాలనే యోచనలో ఉన్నాడట రాజమౌళి. రామ్ చరణ్‌కు 'మగధీర' చిత్రం ఎలానో అల్లు అర్జున్‌కు ఈ సినిమా అలా ఉండాలని అల్లు అరవింద్ కోరాడట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రంతో రామ్ చరణ్ రేంజి తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మళయాలంలోనూ భారీ పాలోయింగ్ ఉన్న నేపథ్యంలో 3డిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











