»   »  'బాహుబలి' ఆడియో ఆల్బమ్... పూర్తి వివరాలు

'బాహుబలి' ఆడియో ఆల్బమ్... పూర్తి వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికి 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్‌ సంస్థ చేజిక్కించుకొంది. ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం ఈ చిత్రం ఆడియో రైట్స్ మూడు కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకూ ఏ చిత్రం ఆడియోకు ఈ రేటు పలకలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది''అన్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌నాయుడు.

Rajamouli's Baahubali Audio Album Details

ఈ చిత్రం ఆడియోని శిల్ప కళా వేదికలో నిర్వహిస్తున్నారు. తెలుగు,తమిళ, బాలీవుడ్ చిత్రాలకు చెందిన ఇండస్ట్రీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొననున్నారు. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...రజనీకాంత్ హాజరయ్యే అవకాసం ఉంది.

ఇక ఈ ఆడియో ఆల్బమ్ వివరాల్లోకి వెళితే...

ఇక ఈ ఆడియోని రాజమౌళి సోదరుడు కీరవాణి అందించారు.పాటలను శివశక్తి దత్తా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, చైతన్య ప్రసాద్, ఇనగంటి సుందర్, ఆదిత్య, నీల్ సీన్ రాసారు.

ఇక పాటలు పాడింది...గీతా మాధురి, దీపు, రమ్య బెహ్రా, మోహన, కార్తీక్, దామిని, సత్య యామినీ, శ్వేత రాజ్, మౌనిమ, రేవంత్, ఆదిత్య, కీరవాణి (సంగీత దర్శకుడే) పాడారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌ హీరో. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ నెల 31న ట్రైలర్‌ని విడుదల చేస్తారు. భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా విలన్ గా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.

భల్లాలదేవ... ఓ యువరాజు. ఆయన శక్తికి తిరుగన్నదేలేదు. బలానికి పోలికే లేదు. అతడి ఆలోచనలను చదవడం ఎవ్వరివల్లా కాదు. అతడి విజృంభణ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలంటున్నారు.

మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి. ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.

English summary
Rajamouli's Baahubali - The Beginning, audio launch will take place at Shilpa Kala Vedika on a grand scale with several bigwigs from Telugu, Tamil and Bollywood film industries attending it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu