రజనీకాంత్ మూవీ రికార్డుకు ప్రభాస్ ‘బాహుబలి’ ఎసరు?

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఏరియాల బిజినెస్ రూ. 79 కోట్లు దాటి పోయింది. మరికొన్ని ఏరియాల రైట్స్ అమ్ముడు కావాల్సి ఉంది. అన్ని కలిపితే థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 105 కోట్లు వస్తాయని అంచనా.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి 'బాహుబలి' చిత్రానికి రైట్స్ రూపంలో రూ. 77 కోట్లు వచ్చినట్లు అంచనా. కర్నాటక నుండి రూ. 9 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 9 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. మరో వైపు శాలిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపంలో రూ. 10 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బాహుబలి రెండు పార్టులుగా విడుదలవుతోంది. పైన చెబుతున్న వివరాలు కేవలం ఫస్ట్ పార్టుకు సంబంధించిన వివరాలు మాత్రమే.

Rajamouli's Baahubali Broke Rajinikanth's Endhiran Business Record?

దీంతో పాటు తమిళం, హిందీ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరుగాల్సి ఉంది. వీటి ద్వారా రూ. 30 నుండి 40 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. దీంతో పాటు ఇతర బాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. అన్ని కలిపితే 'బాహుబలి' ప్రీ రిలీజ్ బిజినెస్ 'రోబో' బిజినెస్ (రూ. 150 కోట్లు) క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X