‘బాహుబలి’ : రాజమౌళి అక్కడ ఇప్పుడేం చేస్తున్నారు?
హైదరాబాద్: తెలుగులో వస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి'. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు భాషల్లో అత్యంత భారీగా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన పనులును టీమ్ ముమ్మరం చేసింది. ఈ చిత్రానికి సంభందించిన కలరింగ్, ఫైనల్ గ్రేడింగ్ పని ని చేయిస్తున్నారు. ఈ మేరకు టీమ్ నిమగ్నమై ఉంది. మీరే చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రీసెంట్ గా ఈ చిత్ర టీం మలయాళంలో ఆడియో లాంచ్ చేయడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ పోస్టర్ ని లాంచ్ చేసారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర మెయిన్ టీం అయిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు సౌత్ ఇండియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు మిగిలిన భాషల వారి చూపు కూడా బాహుబలి పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, పోస్టర్స్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కరణ్ జోహార్ హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
అలాగే ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి వరల్డ్ రికార్డు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ ఆర్గనైజర్స్ ఈ పోస్టర్ ని గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం పంపనున్నారు.
రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు బాహుబలి యూనిట్ ఇప్పటికే కొచ్చిలో పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో ముచ్చటిస్తూ మళయాలం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.
అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.
ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.
అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











