»   »  ప్రభాస్ 'బాహుబలి' కోట స్కెచ్ లు (ఫొటోలు)

ప్రభాస్ 'బాహుబలి' కోట స్కెచ్ లు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్నో వేల స్కెచ్చులు వేసి, ఎంతో పరిశోధన జరిపి.. ఈ సెట్స్‌ని తీర్చిదిద్దాం. ఓ కళాదర్శకుడికి ఎంత స్వేచ్ఛ ఇస్తారో.. అంతకు మించిన స్వేచ్ఛ రాజమౌళి నాకు ఇచ్చారు. ఈ సినిమా కోసమే రెండేళ్ల పాటు నా పనులన్నీ పక్కన పెట్టేశా. మరే చిత్రాన్నీ ఒప్పుకోలేదు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ హైదరాబాద్‌లోనే ఉండిపోయా. 'బాహుబలి' గురించి తప్ప.. ఈ రెండేళ్లూ దేని గురించీ ఆలోచించలేదంటే.. ఈ సినిమాపై నాకెంత ప్యాషన్‌ ఉందో.. అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ చిత్రానికి కళా దర్శకత్వం వహిస్తున్న సాబూ సిరిల్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాహుబలి'.. దేశమంతా ఈ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి 'మహిష్మతి' అనే ఓ రాజ్యాన్ని సృష్టించారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఒక్కో విశేషం బయిటకు వస్తోంది. సెట్స్‌ విషయంలోనే కాదు.. ప్రతీ అంశంలోనూ అంతర్జాతీయ స్థాయి సాంకేతికత కనిపిస్తుంది.

మగధీరతో తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగరాసిన ఈ రాజమౌళి ..ఇప్పుడు రాజుల కాలంనాటి కథను ఎంచుకున్నాడు. ప్రభాస్ హీరోగా, అనుష్క షెట్టి హీరోయిన్ గా గత రెండు సంవత్సరాలుగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. రాజుల కాలం నాటి కథ కావటంతో తీవ్రంగా శ్రమించి రూపొందించారు.

అవకాసం వచ్చింది

అవకాసం వచ్చింది

కళా దర్శకుడే కాదు ఏ సాంకేతిక నిపుణుడైనా సరే తన ప్రతిభను నిరూపించుకొనే మహత్తరమైన అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి అవకాశం నాకూ, నాతో పాటు 'బాహుబలి' బృందానికి కల్పించారు రాజమౌళి అంటున్నారు సాబూ సిరిల్.

 అంతర్జాతీయంగా...

అంతర్జాతీయంగా...

రాజమౌళి ఆలోచనలకు దగ్గరగా వెళ్లి పనిచేయడానికి మేం చాలా కష్టపడ్డాం. దీన్ని ఓ ప్రాంతీయ చిత్రంగా చూడొద్దు. ఇదో అంతర్జాతీయ చిత్రం. ఆస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అంటున్నారు ఆయన.

 'బాహుబలి' సెట్స్‌ కోసం కసరత్తులు

'బాహుబలి' సెట్స్‌ కోసం కసరత్తులు

ఇది వెయ్యేళ్ల కాలం నాటి కథ. అప్పటి జీవన పరిస్థితులు, వాతావరణం, సమాజం ఇవన్నీ ఎలా ఉంటాయో.. వూహించుకోవడమే. నేనూ 'అశోక', 'హేరామ్‌' వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు పనిచేశా. అయితే వాటికి చరిత్ర పుస్తకాల్లో ఎక్కడో చోట రిఫరెన్సులు దొరుకుతాయి. కానీ 'బాహుబలి' అలా కాదు. మా వూహలకూ, ఆలోచనలకూ పదును పెట్టుకొంటూ వెళ్లాము అన్నారు.

 యుద్ధ నేపథ్యంలోని సీన్స్ కు

యుద్ధ నేపథ్యంలోని సీన్స్ కు

'బాహుబలి' చిత్రానికి ప్రధాన ఆకర్షణే... ఆ సన్నివేశాలు. వాటి గురించి చెప్పడం కాదు.. తెరపైచూస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి.. వీటిపై చాలా కసరత్తు చేశాం.

నిర్మాతల నమ్మకం

నిర్మాతల నమ్మకం

సెట్స్‌ విషయంలో రాజమౌళి అభిరుచినే కాదు.. నిర్మాతల నమ్మకాన్నీ మెచ్చుకోవాలి. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని.. ఏం అడిగితే అది ఇచ్చారు.

'మగధీర' కీ 'బాహుబలి' తేడా

'మగధీర' కీ 'బాహుబలి' తేడా

'మగధీర'కూ, 'బాహుబలి'కీ చాలా తేడా ఉంది. 'బాహుబలి'.. ఓ ప్రత్యేకమైన కథ. ఏ సినిమాతోనూ దీన్ని పోల్చలేం. నిజానికి నేను 'మగధీర' పూర్తిగా చూడలేదు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉన్నప్పుడు హోటల్‌ రూమ్‌లో 'మగధీర' చిత్రాన్ని చూపించారు. అందులో మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను బాగా ఆకట్టుకొన్నాయి.

కథలు కథలుగా...

కథలు కథలుగా...

ఈ సినిమా గురించి ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ మొత్తం చర్చించుకొంటోంది. 'బాహుబలి'కి సంబంధించి ఏ చిన్న విషయం బయటికొచ్చినా దాని గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

అవి అందుకోవటానికే..

అవి అందుకోవటానికే..

రాజమౌళి వూహలెప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. అందుకే ప్రేక్షకులూ 'బాహుబలి'ని ఆ స్థాయిలోనే వూహించుకొంటున్నారు. వాళ్ల వూహలకు, అంచనాలకూ తగినట్టుగా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి రెండేళ్లుగా శ్రమిస్తోంది రాజమౌళి బృందం.

ప్రమోషన్ కోసం...

ప్రమోషన్ కోసం...

అలాగే ఈ చిత్రం ప్రమోషన్ కోసం 'మార్చింగ్ ఏంట్స్' ని ముంబైలో సంప్రదించారని తెలుస్తోంది. పోస్టర్ డిజైన్ చేయటంలో ఈ సంస్ద బాలీవుడ్ లో పేరెన్నికగన్నది. అందుకే వీరి దగ్గరకి వెళ్లారని తెలుస్తోంది. ఈ చిత్రం భారీ ప్రాజెక్టు కావటంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని చేస్తున్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఇక మే 15న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని రాజమౌళి అధికారికంగా తెలియజేశాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి...విజువల్ ఎఫెక్ట్ లకు లేటవుతుందని, రిలీజ్ తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు. ఆ రిలీజ్ డేట్ సైతం జూలై 30, 2015 అంటున్నారు.

శాటిలైట్ రైట్స్

శాటిలైట్ రైట్స్


ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి అన్ని చోట్లా చర్చ మొదలైంది. ఈ రైట్స్ ఎంతకు వెళ్తాయి...ఎవరు తీసుకోనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రెండు పార్ట్ లు కలిపి 25 కోట్లకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

రెండు భాగాలు..

రెండు భాగాలు..

బాహుబలి రెండు బాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి పార్ట్ 2 విడుదల ఎప్పుడనేది మాత్రం రాజమౌళి చెప్పలేదు. అయితే తొలి బాగానికి రెండవ బాగానికి గ్యాప్ తక్కువగా ఉండాలని, గ్యాప్ ఎక్కువగా ఉంటే కథలోని ఫీల్ మిస్సవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

English summary
Baahubali (Prabhas) and his cousin Ballala Deva (Rana) lives in the fictional kingdom of Mahishmathi which was built around a hill in undated age of empires. These are stills of that fort set.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu