రాజమౌళి 'బాహుబలి' కొత్త సెట్స్...ఇన్ఫో
హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్ లో భారీ ఎత్తున రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . 'బాహుబలి' మరోదఫా చిత్రీకరణ కోసం సాబు సిరిల్ కొత్త సెట్‌ని రూపొందిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యార్లగడ్డ శోభు నిర్మాత. ప్రభాస్, రానా, అనుష్క తదితరులు ప్రధాన పాత్రధారులు. ఈ నెల 15 నుంచి ఇక్కడ షూటింగ్ జరగబోతోంది. చిత్ర బృందంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు.
ఇందులో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. ఈ విషయమై సుదీప్ మాట్లాడుతూ... నేను బాహుబలి చిత్రంలో ఆయుధాల వ్యాపారిగా కనిపిస్తాను. నా పాత్ర పేరు అస్లం ఖాన్. అంతేగాక ఈ చిత్రంలో నాకు సత్యరాజ్ కు మధ్య కత్తి పైట్ సీన్ ఉందని అన్నారు.

అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానాతో పాటు 'పంజా' ఫేమ్ అడివి శేష్ నటించనున్నాడు. వీరితో పాటు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సుదీప్ నటించనున్నాడని, ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా చాలా ప్రాధాన్యత వుంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.


Click it and Unblock the Notifications











