బాహుబలి 'లీక్' : మరో ఇద్దరి ప్రమేయం... 5 నెలల నుండీ
హైదరాబాద్: విడుదలకు ముందే 'బాహుబలి' చిత్రంలోని దృశ్యాలు బయటకు రావడం వెనుక చాలా తతంగం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఐదారునెలల నుంచి ఈ దృశ్యాలను ల్యాబ్ నుంచి బయటకు తీసుకురావాలని సెంట్రల్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న వర్మతో పాటు మరో ఇద్దరు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు డీసీపీ(నేరాలు) రవివర్మ ప్రత్యేక బృందాన్ని నియమించారు.
'బాహుబలి'కి మరింత హంగులు తీసుకొచ్చే నేపథ్యంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పోరాట దృశ్యాలను ఆకర్షణీయంగా చిత్రీకరించాలని మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకు గత ఏడాది ఆగస్టులో అప్పగించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న బివీవీఎల్‌ఎన్ వర్మపై అప్పటికే ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు.'
దీంతో వర్మ తన సంస్థకు ఏదైనా నష్టం చేయాలన్న కసితో అప్పుడప్పుడూ వస్తుండేవాడు. పాత ఉద్యోగి కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. గత ఏడాది అక్టోబరులో వర్మ తన ల్యాప్‌ట్యాప్‌లో 12 నిమిషాల నిడివి ఉన్న బాహుబలి చిత్ర దృశ్యాలను తస్కరించాడు. అనంతరం సొంతూరికి వెళ్లి అక్కడ ఇద్దరు, ముగ్గురితో విషయం చర్చించాడు.

వీటిని అంతర్జాలంలో ఉంచితే సినిమా అపజయం పాలవుతుందని చెప్పగా... ఓ పథకం రూపొందించారు. ల్యాప్‌టాప్‌లో ఉన్న పోరాట దృశ్యాలను మరో సీడీలోకి మార్చి ల్యాప్‌ట్యాప్‌లో దృశ్యాలను తొలగించారు. సంక్రాంతి సందర్భంగా ఈ వీడియోను అప్‌లోడ్ చేయాలని నిర్ణయించారు. కుదరకపోవడంతో జనవరి 23న యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఉంచారు.
విచారిస్తున్న పోలీసులు
అంతర్జాలంలో బాహుబలి దృశ్యాలు ప్రసారమవుతున్నాయని తెలుసుకున్న వెంటనే చిత్రనిర్మాత శంభు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి వాటిని తొలగించాలని అభ్యర్థించారు.నిందితుడు వర్మ చెప్పిన అంశాల ఆధారంగా ఇప్పటికే తాము కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామంటూ పోలీసులు వారికి చెప్పారు. వీరిద్దరి కోసం వర్మ స్నేహితులు, బంధువులను విచారించామని, నాలుగైదు రోజుల్లో ఎక్కడున్నారో తెలుస్తుందని డీసీపీ తెలిపారు. నిందితుడు వర్మ గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారంటూ కొందరు తమకు సమాచారం ఇచ్చారని, దీనిపైనా విచారిస్తున్నామన్నారు.
కేసు మొదటి నుంచీ గమనిస్తే...

బాహుబలి సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోలేకపోయి... 13 నిమిషాల నిడివి గల మేకింగ్ వీడియో లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ విషయంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్మను సీసీఎస్ పోలీసుల అరెస్టు చేశారు. వర్మ ద్వారానే వీడియో లీకైనట్టు పోలీసులు నిర్ధారించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి వర్మనే మేనేజర్ కావడంతో ల్యాప్‌ట్యాప్ ద్వారా తన స్నేహితులకు వీడియోను సులభంగా పంపించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కంపెనీలో పనిచేసిన బీవీవీఎల్‌ఎన్ వర్మ అనే ఉద్యోగి జనవరి మొదటి వారంలో బాహుబలి చిత్రంలోని యుద్ధసన్నివేశాల డేటాను కాపీ చేశాడు. బాహుబలి గ్రాఫిక్స్ పనులు జరుగుతున్న సమయంలో వర్మ మకుటలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తర్వాత కంపెనీతో వివాదాలు రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. కంపెనీపై పగ తీర్చుకోవడానికి వర్మ బాహుబలిని అస్త్రంగా వాడుకున్నాడు.
కంపెనీలో పనిచేసే సమయంలో బ యటకు తీసుకొచ్చిన వీడియోను ముందుగా తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకుని, స్నేహితులకు, బంధువులకు పంపాడు. ఇలా ఈ సన్నివేశాలు యూట్యూబ్‌లోకి.. సామాజిక సైట్లలోకి చేరిపోయాయి. ఫిర్యాదు అందిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్‌కు సంబంధించిన మొత్తం పది మందిని ప్రశ్నించిన పోలీసులు వర్మను నిందితుడిగా నిర్ధారించారు. కేసును సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేశారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్ర సన్నివేశాల లీకేజీ కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఛేదించారు. పోలీసులు అనుమానిస్తున్నట్లుగానే గ్రాఫిక్స్ కంపెనీకి చెందిన ఉద్యోగే నిందితుడని తేలింది. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎస్ ఉపకమిషనర్ రవివర్మ వెల్లడించారు.
చిత్రం ప్రథమార్థంలోని కీలక సన్నివేశాలు లీకయ్యాయని నిర్మాత, అర్కా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభు యార్లగడ్డ కొద్దిరోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ సన్నివేశాలు రెండు రోజుల క్రితం వివిధ సామాజిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్‌లో ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంబైకి చెందిన మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి అప్పగించారు.
హైదరాబాద్‌లోని ఆ సంస్థ శాఖలో బాహుబలి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. రాజమౌళి ఇంతకుముందు రూపొందించిన ఈగ చిత్రానికి సైతం ఈకంపెనీయే గ్రాఫిక్స్‌ను వర్క్ చేసింది. ఈగ చిత్రంలో గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించడంతో బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ అదే కంపెనీకి అప్పగించారు.


Click it and Unblock the Notifications











