రాజమౌళి స్పెషల్ షో విత్ 'బాహుబలి' మేకింగ్ (వీడియో)
హైదరాబాద్: రాజమౌళి రెండన్నప ఏళ్ళగా ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి' . రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలోని మొదటి భాగం జూలై10న విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని ఇప్పటికే విడుదల చేసారు. హిందీ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత కరణ్‌జోహర్ ముంబయిలో విడుదల చేశారు. ప్రమోషన్ లో భాగంగా...దర్శకుడుని ఓ మేకింగ్ వీడియో రెడీ చేసి ఇమ్మన్నారు. దాంతో ఆయన ఓ వీడియోని తన గురించి, తన బాహుబలి గురించి చెప్తూ ఇవ్వటం జరిగింది. దాన్ని ధర్మ ప్రొడక్షన్స్ తమ అఫీషియల్ యూ ట్యూబ్ ఛానెల్ లో ఉంచటం జరిగింది. దాన్ని మీరు ఇక్కడ వీక్షించండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బాహుబలి' సినిమా ట్రైలర్ విడుదలైంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. అంతకన్నా ముందు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ ఉదయం 10:30కు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లోని 300కి పైగా థియేటర్లలో బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చుసిన అబిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ ట్రైలర్ మొదటిగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని తెలుసుకున్న అబిమానులు మార్నింగ్ నుండే థియేటర్స్ దగ్గర లైన్లు కట్టారు విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి ట్రైలర్‌ను చూసినవారంతా అద్భుతమైన రెస్పాన్స్ కనుపరుస్తున్నారు. ప్రభాస్, రానాల స్టన్నింగ్ లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది.
ఇక "నన్నెప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి.. నేనేవర్ణి?" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌కు అబిమానుల ఈలలతో ధియేటర్ లలో మారుమోగిపోయాయి. రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్‌లో విడుదలకు ముందే ట్రైలర్‌ను వీక్షించిన అభిమానులు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారి ఆనందాన్ని పంచుకున్నారు. జులై 10న ఈ చిత్రం పేక్షకుల ముందుకు రానుంది.
రెండు నిమిషాల థియేట్రికల్ ట్రైలర్ సినిమా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఆన్‌లైన్‌లో విడుదలయిన 24గంటల లోపే 10 లక్షల మందికి పైగా చూశారు. ఇప్పటి వరకూ ఏ సినిమా ట్రైలర్‌కు ఈ రకమైన ఆదరణ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ట్రైలర్‌తోనే ‘బాహుబలి' రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











