twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' ఆడియో పంక్షన్ : ఎవరేమన్నారు? (ఫొటోలతో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :'బాహుబలి' ఆడియో వేడుక నిన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. మే 31న జరగాల్సిన ఈ ఆడియో పంక్షన్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో 'బాహుబలి' ఎదురుచూపులు కొనసాగాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఎట్టకేలకు శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి వేంకటేశుని సాక్షిగా, ఆయన సన్నిధి తిరుపతిలో పాటల పండుగు కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. అభిమానులంతా ఆనందోత్సాహాలతో ఈ పంక్షన్ ని ఎంజాయ్ చేసారు.

    'బాహుబలి' గురించి ఎన్నో కబుర్లు బయటకు వచ్చాయి. 'బాహుబలి' కోసం మూడేళ్ల పాటు పాటుపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాపై పెదవి విప్పారు. ''రాజమౌళి లాంటి వ్యక్తిని నేనింత వరకూ చూళ్లేదు. ఇక చూడను కూడా. నేను ఆయన అభిమాని. నేనెంత పెద్ద అభిమానినో ఆయనకు తెలీదు'' అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.

    ఇంకా 'బాహుబలి' గురించి ఎవరేమన్నారు స్లైడ్ షోలో..ఆడియో ఫోటోలతో

    ప్రభాస్ మాట్లాడుతూ...

    ప్రభాస్ మాట్లాడుతూ...

    ''ఈ సినిమాకి పనిచేసిన వాళ్ల గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. సమయం సరిపోదు. 'సింహాద్రి' విడుదలైంది. తారక్‌ నన్ను ప్రివ్యూకి పిలిచాడు. ఆ సినిమా చూస్తుండగా నాకు పిచ్చెక్కిపోయింది. ఇతనేం దర్శకుడు రా బాబోయ్‌... అని ఆశ్చర్యపోయా.

    అప్పుడు తొలిసారిగా...

    అప్పుడు తొలిసారిగా...

    'ఇలాంటి దర్శకుడితోనేనా నేను సినిమా చేయలేకపోయా. ఇక మేమిద్దరం కలిసి జీవితంలో సినిమా చేయలేమేమో' అనుకొన్నా. ఆ సమయంలోనే రాజమౌళిగారి దగ్గరికి వెళ్లి 'సింహాద్రి' చూశాను సర్‌.. బాగుంది' అన్నా. 'అవునా... మనం కలుద్దాం' అన్నారు. ఆ తర్వాత ఓ హోటల్‌లో కలుసుకొన్నాం, మనం సినిమా చేద్దాం అన్నారు రాజమౌళిగారు.

    సంభంధం లేదు

    సంభంధం లేదు

    అప్పటికే నాకు ఫ్లాప్స్‌ ఉన్నాయి. 'నాకు సినిమా ఫ్లాప్స్‌, హిట్స్‌తో సంబంధం లేదు.. మనం సినిమా చేద్దామంతే' అన్నారాయన. 'ఛత్రపతి'తో మేం సన్నిహితులమైపోయాం. రాజమౌళిది ఒక రకమైన క్యారెక్టర్‌ అంతే.

    ఊహించలేదు

    ఊహించలేదు

    నా జీవితంలో 'బాహుబలి'లాంటి సినిమా చూడలేదు. ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. అందుకే అడిగిన వెంటనే అంగీకరించా. రాజమౌళి నాతో ఇంత పెద్ద సినిమా చేస్తారని వూహించలేదు'' అన్నారు.

    విడుదల తేదీ గురించి ...

    విడుదల తేదీ గురించి ...

    ప్రభాస్‌ రాజమౌళిని అడుగుతూ ''సగటు ప్రేక్షకుడిలాగే నేనూ సినిమా విడుదల ఎప్పుడని అడుగుతున్నా'' అన్నారు. జులై 10న అని రాజమౌళి చెప్పడంతో ప్రభాస్‌ ఆ తేదీని మరోసారి ప్రకటించారు.

     రాజమౌళి మాట్లాడుతూ...

    రాజమౌళి మాట్లాడుతూ...

    ''ఈ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు సాధారణంగా అలుపు, నిస్పృహలు ఆవహిస్తాయి. అలాంటప్పుడు చిత్ర యూనిట్ అంతా ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. దర్శకుడికి విలువ ఇచ్చే నటుడు సత్యరాజ్‌. నాజర్‌గారి దగ్గర నేను ఓ సహ విద్యార్థిగా భావిస్తా.

    రాజమౌళి కంటిన్యూ చేస్తూ..

    రాజమౌళి కంటిన్యూ చేస్తూ..

    'నువ్వు ఏ సినిమా తీసినా ఓ క్లాసిక్‌ అనుకో..' అనేవారాయన. ప్రతిసారి ఆ మాటే గుర్తొచ్చేది. ఇన్నాళ్లకు 'బాహుబలి' రూపంలో ఓ క్లాసిక్‌ తీయగలిగా అనిపించింది.

    తమన్నా గురించి రాజమౌళి

    తమన్నా గురించి రాజమౌళి

    తమన్నా ప్రొఫెషనలిజం చూసి ఆశ్చర్యపోయా. బల్గేరియాలో తీవ్రమైన చలిలో ఓ పాట తెరకెక్కించాం. అందులోని ఓ షాట్‌ తెల్లవారుఝామున తెరకెక్కించాం. ఎముకలు కొరికే చలి. చేతికున్న గ్లౌజులు తీస్తే.. చేయి గడ్డకట్టుకుపోతుందేమో అన్నంత భయం. అలాంటి సమయంలో.. చుట్టూ నాలుగు గుడ్డముక్కలు అడ్డుపెట్టుకొని దుస్తులు మార్చుకొంది.

    అనుష్క గురించి రాజమౌళి

    అనుష్క గురించి రాజమౌళి

    నేను ఏ హీరోయిన్ తో అయినా మళ్లీ మళ్లీ సినిమా తీయాలనుకొంటే.. తనే అనుష్క. ఈ కథ చెబుతున్నప్పుడు తనెంతో ఉద్వేగానికి లోనైంది. రమ్యకృష్ణకు పోటీగా నటించింది.

    రానా గురించి రాజమౌళి

    రానా గురించి రాజమౌళి

    ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే ఫిక్సయిపోయా. ప్రభాస్‌కి ఓ ప్రతినాయకుడు కావాలి. తను ప్రభాస్‌కంటే ఎత్తుగా ఉండాలి. ప్రభాస్‌ కంటే బలంగా ఉండాలి. అలా అనుకొన్నప్పుడు రానానే గుర్తొచ్చాడు. ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. కానీ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

    సలహా చెప్పండన్నాడు

    సలహా చెప్పండన్నాడు

    మళ్లీ ఓ రోజు నాదగ్గరకు వచ్చి 'హీరో గా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా. ఇలాంటి సమయంలో విలన్ గా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అని అన్నానో అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను. రెండుమూడు గంటలు ఆలోచించుకొని 'నేను భళ్లాలదేవగా నటించడానికి సిద్ధమే' అన్నాడు.

    ఉత్తరం రాసాడు

    ఉత్తరం రాసాడు

    రానా పైకి అలా కనిపిస్తాడుగానీ మనిషి చాలా సున్నితం. ఈ సినిమా ముగిశాక మా అందరికీ ఓ ఉత్తరం రాశాడు. ఈ టీమ్‌తో తనకున్న అనుబంధం పంచుకొన్నాడు. ఆ లెటర్‌ చూశాక మాకు కన్నీళ్లు ఆగలేదు. తనలో మంచి రచయిత ఉన్నాడనిపించింది.

    ప్రభాస్ గురించి రాజమౌళి

    ప్రభాస్ గురించి రాజమౌళి

    ఇక ప్రభాస్‌ డార్లింగ్‌. ఈ సినిమాపై మా అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకొన్నది ప్రభాసే. నిరాశలో ఉన్నప్పుడు దర్శకుణ్ని నిలబెట్టేవాడు కావాలి. అలా నన్ను నిలబెట్టాడు ప్రభాస్‌.

    రెండేళ్లు తీసుకోమన్నాడు

    రెండేళ్లు తీసుకోమన్నాడు

    ఆరేళ్ల కిత్రం 'బాహుబలి' ఆలోచన వచ్చింది. నాలుగేళ్ల క్రితం లైన్‌ చెప్పా. మూడేళ్ల క్రితం పూర్తి కథ వినిపించా. రెండేళ్ల క్రితం 'నీ డేట్స్‌ ఓ ఏడాది పాటు కావాలి' అని అడిగా. 'రెండేళ్లు తీసుకో డార్లింగ్‌' అని ఇచ్చేశాడు. 'నువ్వు తీస్తున్నది మామూలు సినిమా కాదు. ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా..' అంటూ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ బాసటగా నిలిచాడు.

    కుటుంబం గురించి రాజమౌళి

    కుటుంబం గురించి రాజమౌళి

    ఇక నా కుటుంబం గురించి చెప్పాలి. నాకు కొండంత అండగా నిలిచింది నా కుటుంబం. రమ నా వెనుక లేకపోతే.. ఈ సినిమా తీయగలిగేవాణ్ని కాదు.

    కీరవాణి గురించి,తండ్రి గురించి రాజమౌళి

    కీరవాణి గురించి,తండ్రి గురించి రాజమౌళి

    అన్నయ్య కీరవాణి లాంటి సంగీత దర్శకుడు ఇంకెవ్వరికీ దొరకరు. నా సినిమాల్లోని డ్రమటిక్‌ సన్నివేశాలు మీ అందరికీ నచ్చుతున్నాయంటే కారణం.. మా నాన్నగారి నుంచి నేను నేర్చుకొన్న విద్యే.

    తన కొడుకు గురించి రాజమౌళి

    తన కొడుకు గురించి రాజమౌళి

    మా అబ్బాయి కార్తికేయ అన్నీ తానై చూసుకొన్నాడు. నా తిట్లూ భరించాడు. వీళ్లందరికీ థ్యాంక్స్‌..'' అన్నారు.

    రానా మాట్లాడుతూ ....

    రానా మాట్లాడుతూ ....

    ''నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెరగడం వల్ల నాకు దేవుళ్లు అంటే హీరోలు, హీరోయిన్లే. శ్రీకృష్ణుడు అంటే నందమూరి తారకరామారావుగారే. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణగారే, అలాగే భక్తకన్నప్ప అంటే కృష్ణంరాజుగారే గుర్తొస్తారు. ఈ సినిమా నేను ఒప్పుకొన్నప్పుడు అందరూ 'నీకు అవసరమా. మూడేళ్లు.. అందులోనూ విలన్ పాత్ర' అని అన్నారు. వారికి నా సమాధానమిదే. 'బాహుబలి' కలకాలం నిలబడే శిల్పం లాంటిది. విజయేంద్ర ప్రసాద్‌, రాజమౌళి తీస్తున్న అద్భుతమైన చిత్రమిది. మనకు రామాయణం ఎలాగో 'బాహుబలి' అలాగా'' అన్నారు.

    కృష్ణంరాజు మాట్లాడుతూ ...

    కృష్ణంరాజు మాట్లాడుతూ ...

    ''బాహుబలి' ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది. అభిమానుల ఆశీస్సులే ప్రభాస్‌ ఒంట్లో రక్తంగా ప్రవహిస్తున్నాయి. అదే ప్రభాస్‌ను ముందుకు నడిపిస్తోంది. నాకు తొలిసారిగా మైక్‌ పట్టుకొని మాట్లాడాలంటే భయం వేస్తోంది. ఇంతటి గొప్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్‌ గురించి చెప్పాలంటే 'మిర్చి' లాంటి పొగరుబోతు, 'డార్లింగ్‌' లాంటి స్నేహితుడు.

    కృష్ణం రాజు కంటిన్యూ చేస్తూ..

    కృష్ణం రాజు కంటిన్యూ చేస్తూ..

    నేను నిన్న దిల్లీలో ఉన్నా.. అక్కడ వాళ్లందరూ బాహుబలి, రాజమౌళి గురించి అడుగుతున్నారు. రాజమౌళి భారతీయ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లగలిగే గొప్పవాడు అని చెప్పాను.

    రాజమౌళి కు చెతులెత్తి నమస్కరిస్తున్నా

    రాజమౌళి కు చెతులెత్తి నమస్కరిస్తున్నా

    నాకన్నా చిన్నోడైనా రాజమౌళికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లినందుకు ఈ నమస్కారము''అన్నారు కృష్ణరాజు.

    అనుష్క మాట్లాడుతూ...

    అనుష్క మాట్లాడుతూ...

    ''సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకుల్లాగే మేమూ ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాలో నేను చేసిన దేవసేన పాత్ర కోసం మేకప్‌ వేసుకోవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం పట్టేది. మొదట విదేశాల నుంచి మేకప్‌ నిపుణుల్ని పిలిపించాం. అనుకొన్నట్టుగా చేయలేకపోయారు.

    అనుష్క కంటిన్యూ చేస్తూ...

    అనుష్క కంటిన్యూ చేస్తూ...

    ఆ తర్వాత మేకప్‌ నాయుడుగారు నేను ప్రయత్నిస్తానని చెప్పి నెలపాటు ప్రత్యేక పరిశోధన చేసి పాత్రకు తగ్గట్టుగా మేకప్‌ వేసి చూపించారు. రెండున్నర గంటలపాటు మేకప్‌ వేసుకోవాలంటే ఇబ్బందవుతోంది అంటే ఆయన మరింత కసరత్తు చేసి ఆ సమయాన్ని తగ్గిస్తూ మేకప్‌ వేశారు. నాయుడుగారి కృషి వెలకట్టలేనిది'' అన్నారు.

    తమన్నా మాట్లాడుతూ....

    తమన్నా మాట్లాడుతూ....

    ''ఇది కీరవాణిగారి రోజు. కీరవాణిగారి పాటలు కాలాతీతమైనవి. ఎప్పుడు విన్నా మొదటిసారే విన్నట్టు, మళ్లీ వినాలనిపించేట్టు ఉంటాయి. పచ్చబొట్టు.. పాట చిత్రీకరణ సమయంలో నా కలలోకి ఆ పాటే వచ్చేది. ఈ సినిమా వెనక చాలామంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. వాళ్లందరినీ వేదికపై తలచుకొనేలా చేసిన రాజమౌళిగారికి కృతజ్ఞతలు'' అన్నారు.

    అడవి శేష్‌ మాట్లాడుతూ...

    అడవి శేష్‌ మాట్లాడుతూ...

    ''సినిమాలో నా పాత్ర పేరు భద్ర. భీమరాజు అన్నమాట. ఇంతకంటే నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదనేది దర్శకుడు రాజమౌళిగారి సూచన. శోభుగారి ద్వారా రాజమౌళిగారిని కలిశా. 'మీ సినిమాలో నటించాలని ఉంద'ని నా కోరికని వెలిబుచ్చా. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆరు నెలలకు రాజమౌళిగారి నుంచి కాల్‌ వచ్చింది. 'బాహుబలి'లో ఓ పాత్ర చేయాలనేది ఆ కాల్‌ సారాంశం. దాంతో నా కల నెరవేరిన అనుభూతి కలిగింది. 'బాహుబలి' చిత్రీకరణ ఓ గొప్ప అనుభూతినిచ్చింది.

    సత్యరాజ్‌ మాట్లాడుతూ....

    సత్యరాజ్‌ మాట్లాడుతూ....

    ''అందరూ సినిమా ఎందుకు ఆలస్యమవుతుందని అడుగుతున్నారు. అందుకు కారణం ప్రభాస్‌ అభిమానులే అంటాను నేను. ఎందుకంటే వాళ్లను సంతృప్తి పరచడానికే ఇంత ఆలస్యం జరుగుతోంది'' అన్నారు. ''ఈమధ్యే హాలీవుడ్‌ సినిమా అవతార్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ రాజమౌళికి ఫోను చేశారు. హాలీవుడ్‌కి మాత్రం రావద్దని కోరారు'' అంటూ చమత్కరించారు.

    రమ్యకృష్ణ మాట్లాడుతూ...

    రమ్యకృష్ణ మాట్లాడుతూ...

    ''చాలాకాలం నుంచి ఈ సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి తన కలల్ని సాకారం చేయాడానికి ఎంతో కష్టపడుతున్నారు. దాని కోసం వల్లిగారు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రొడక్షన్‌ బాయ్‌ నుంచి అందరూ సినిమా కోసం మనసు పెట్టి పని చేస్తున్నారు.

    రమ్యకృష్ణ కంటిన్యూ చేస్తూ...

    రమ్యకృష్ణ కంటిన్యూ చేస్తూ...

    ఈ సినిమా ఆలస్యమైంది అంటూ చాలామంది అంటున్నారు. ఇలాంటి సినిమాని హాలీవుడ్‌లో టాప్‌ టెక్నీషియన్లకు ఇస్తే పూర్తి చేయడానికి పదేళ్లు పడుతుంది. ఇక్కడ కాబట్టి మూడేళ్లు పడుతోంది. అంతటి నాణ్యత ఉంటుందీ సినిమాలో. అదీ రాజమౌళి సత్తా'' అన్నారు.

    నాజర్‌ మాట్లాడుతూ...

    నాజర్‌ మాట్లాడుతూ...

    ''నా పూర్తి నట జీవితంలో ఇలాంటి సినిమా కోసం ఎదురు చూశాను. నా మొత్తం సినిమాల్లో ఉత్తమమైన చిత్రంగా చెప్పొచ్చు. సినిమా కోసం పని చేసిన 2228 సాంకేతిక నిపుణులు అంటే చాలా ఇష్టం. అందులోనూ దేవుడు అనే సహాయకుడు అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో నాకో నకిలీ చెయ్యి ఉంటుంది. దాన్ని చిత్రీకరణ జరిగనన్నాళ్లూ మోసిన దేవుడు అంటే నాకు చాలా ఇష్టం'' అన్నారు.

    జోక్స్...స్ఫూఫ్స్

    జోక్స్...స్ఫూఫ్స్

    అదే స్పీడులో తమ సినిమాపై జోకులేసుకొంది 'బాహుబలి' టీమ్‌. ఆ జోక్స్ ని అందరూ ఎంజాయ్ చేసారు. తెగ నవ్వుకున్నారు. ఇలా ఆడియో ఫంక్షన్ లో జోక్స్ వేయటం గొప్ప విషయమే.

    English summary
    Baahubali audio released yesterday at Tirupathi. The movie is produced under Arka Productions and has also partnered with Karan Johar's Dharma Productions for its release in Hindi language. It will originally be released in Telugu and Tamil, while its dubbed versions will be released in Hindi, English and French. Baahubali is all set to hit the silver screens across the world on July 10.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X