»   »  'బాహుబలి' కొత్త ఫొటోలు: ప్రభాస్‌, రానా డిఫెరెంట్ గా

'బాహుబలి' కొత్త ఫొటోలు: ప్రభాస్‌, రానా డిఫెరెంట్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: యావత్‌ భారత చిత్ర పరిశ్రమ విడుదల రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి'. దానికి అభిమానుల ఉత్సాహాన్ని , ఎదురుచూపులుని మరింతగా పెంచటానికి ప్రమోషన్స్ సైతం పెంచేసారు. రోజుకో రకమైన సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా చేసే ప్రమోషన్ తో మతిపోయేలా చేస్తున్నారు.

ఈ నేపద్యంలో తాజాగా ప్రభాస్‌, రానాలకు సంబంధించిన కొత్త ఫొటోలను బాహుబలి యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఏ అంశం విడుదల చేసిన అమితాసక్తి గొలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు, చిత్రంలోని పాత్రల పరిచయాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.


రీసెంట్ గా... ‘చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతుల్తో చంపాలని నేనూ..' అని రానా చెప్తూంటే... అనుష్క...‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి తిరిగొచ్చాడు!' అంటూ రీసెంట్ గా ఓ డైలాగు ట్రైలర్ వదిలి అదరకొట్టారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


స్లైడ్ షోలో కొత్త ఫొటోలు...


డిఫెరెంట్ గా...

డిఫెరెంట్ గా...


ప్రభాస్ ఇప్పటివరకూ కనపడని కొత్త లుక్ తో ఆకట్టుకుంటూ...ఫెరఫెక్ట్ విలన్

ఫెరఫెక్ట్ విలన్


రానా కర్కసమైన చూపులతో కన్పిస్తూ భయపెడుతున్నాడుయోధుడుగా...

యోధుడుగా...


బాహుబలిగా కదన రంగానికి సిద్ధమైన యోధుడిగా ఈ చిత్రంలో కనువిందు చేశారు.సిక్స్ ప్యాక్ బాడీతో

సిక్స్ ప్యాక్ బాడీతో


ప్రభాస్‌ శివుడిగా సిక్స్ ప్యాక్ బాడీతో , మెడలో శివలింగంతో ఉన్నప్పడిదిరాజసం ఉట్టిపడుతూ

రాజసం ఉట్టిపడుతూ


ప్రభాస్ రాజసం ఉట్టిపడుతూ తన దైన శైలిలో ఇలా...భారీగా

భారీగా


దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటోందిసెన్సార్ పూర్తి

సెన్సార్ పూర్తి


ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది. దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తి అయినవట్లే...హాలీవుడ్ సైతం...

హాలీవుడ్ సైతం...


ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది .భారతీయభాషల్లో...

భారతీయభాషల్లో...


తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు.సబ్ టైటిల్స్..

సబ్ టైటిల్స్..


ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆరేళ్ల క్రితమే

ఆరేళ్ల క్రితమే


రాజమౌళి మాట్లాడుతూ.... ' 'ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకొన్నా అన్నారువిలన్ కే ప్రాధాన్యత

విలన్ కే ప్రాధాన్యత


నా సినిమాల్లో విలన్ కు చాలా ప్రాధాన్యముంటుంది. తను ఎంత బలంగా ఉంటే... హీరో పాత్ర అంత బలంగా ఎలివేట్‌ అవుతుంది అని రాజమౌళి చెప్పారు అందుకే రానాని తీసుకున్నాం...

అందుకే రానాని తీసుకున్నాం...


ప్రభాస్‌కంటే ఎత్తు, ప్రభాస్‌ కంటే బలంగా ఉన్న నటుడు కావాలనుకొన్నా. ఆ సమయంలో నాకు రానానే గుర్తొచ్చాడు.పాత్ర చెప్పి ఒఫ్పించా

పాత్ర చెప్పి ఒఫ్పించా


ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మళ్లీ ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'హీరోగా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా. ఇలాంటి సమయంలో ప్రతినాయకుడిగా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అన్నానో... అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను.టీమ్ వర్క్

టీమ్ వర్క్


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.English summary
Indian’s biggest motion picture Baahubali is gearing up for a Grand worldwide release as never seen before in 4000+ locations on July 10th.
Please Wait while comments are loading...