'బాహుబలి' ట్రైలర్ : థియోటర్స్ లో ఫ్రీగా ఈ రోజు ఉదయమే

By Srikanya

హైదరాబాద్ : భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు అంటే (జూన్‌ 1న) 2 నిమిషాల ట్రైలర్‌ని ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం పదిన్నర కు విడుదల చేయబోతున్నారు. అందుకు సంభందించిన థియోటర్స్ లిస్ట్ ని క్రింద చూసుకుని వెళ్లండి...

Posted by SS Rajamouli on 31 May 2015

ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

Rajamouli's Baahubali movie trailer release theaters

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క శనివారం విడుదలైన 'బాహుబలి' టీజర్‌ అభిమానులను విశేషంగా అలరిస్తూ ఆన్‌లైన్‌లో దూసుకుపోతోంది. శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్‌ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్‌లో కనిపించాడు. చివరిగా ప్రభాస్‌ కళ్లను మాత్రమే చూపించారు.

ఇక ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం ట్రైలర్‌ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ అంతా సిద్ధం చేసింది. అయితే అంతకంటే ముందుగా సినిమాలో నటించిన రానా, అనుష్క, తమన్నా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు బాహుబలి చిత్ర విశేషాలను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అనంతరం 5 గంటలకు ట్రైలర్‌ విడుదల చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X