»   » 'బాహుబలి' ట్రైలర్ రివ్యూ

'బాహుబలి' ట్రైలర్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

-----సూర్య ప్రకాష్ జోశ్యుల
హైదరాబాద్ : రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాకు...రెండు నిముషాల ట్రైలర్ కట్ చేయటానికి ఇంకొంచెం కష్టపడి ఉండి ఉంటే...బాగుండేది. ప్రతీ షాట్... విజువల్ గా హాలీవుడ్ స్దాయిలో ఉన్నాయి. కానీ...ట్రైలర్ కట్ చేసిన ఆర్డర్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. మంచి షాట్స్ వెతకటానికి కొంచెం బద్దకించినట్లో...లేకపోతే ఇప్పుడే వాడేయిటం ఎందుకునో అనుకున్నారు టీమ్. సినిమాపై ఉత్సుకత రేకిత్తించటానికి బదులు...సినిమా కథను రివిల్ చేసినట్లుగా ట్రైలర్ రూపొందింది. అయినా రాజమౌళి కష్టం...ప్రతీ ఫ్రేమ్ లో నూ కనిపిస్తోంది. పనిగట్టుకుని ప్రభాస్ ని తగ్గించి...రానా ని ఎత్తుతున్నట్లు అనిపించింది.

'బాహుబలి' కి కథ అందించిన విజియేంద్రప్రసాద్ గారు కథ అందించిన మరో చిత్రం సల్మాన్ ఖాన్...బజరింగీ భాయిజాన్ తో పోలిస్తే...ఆ ట్రైలరే అద్బుతంగా ఉన్న ఫీల్ వచ్చింది. హీరోని మరింతగా చూపితే బావుండేది ప్రభాస్ అభిమానులు ఫీలవుతున్నారు.


Rajamouli's Baahubali movie trailer review

నేనొవరో తెలియని కళ్ళు కూడా నన్ను దేవుడిలా చూస్తున్నాయి. ఇంతకీ ఎవరు నేను అని ప్రభాస్ అడిగే డైలాగుతో ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ రోజు అంటే (జూన్‌ 1న) 2 నిమిషాల ట్రైలర్‌ని ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం పదిన్నర కు విడుదల చేసారు.


Rajamouli's Baahubali movie trailer review

ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Rajamouli's Baahubali movie trailer review

మరో ప్రక్క శనివారం విడుదలైన 'బాహుబలి' టీజర్‌ అభిమానులను విశేషంగా అలరిస్తూ ఆన్‌లైన్‌లో దూసుకుపోతోంది. శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్‌ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్‌లో కనిపించాడు. చివరిగా ప్రభాస్‌ కళ్లను మాత్రమే చూపించారు.


Rajamouli's Baahubali movie trailer review

ఇక ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం ట్రైలర్‌ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ అంతా సిద్ధం చేసింది. అయితే అంతకంటే ముందుగా సినిమాలో నటించిన రానా, అనుష్క, తమన్నా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు బాహుబలి చిత్ర విశేషాలను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అనంతరం 5 గంటలకు ట్రైలర్‌ విడుదల చేస్తారు.

English summary
Baahubali - The Beginning trailer released today. Multiplexes will not be able to play the trailer for free, It is attached to the running movie.. Few theatres, where the morning show starts at 10:30am or before, might have difficulty in playing the trailer for free..
Please Wait while comments are loading...