»   » భళిరా భళి (‘బాహుబలి - ద బిగినింగ్‌’ ప్రివ్యూ)

భళిరా భళి (‘బాహుబలి - ద బిగినింగ్‌’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో ఏ చిత్రం గురించి ఇంతగా సినీ అభిమానులు ఎదురుచూడలేదేమో. ముఖ్యంగా ఈ రేంజి బడ్జెట్ లో ఓ రీజనల్ చిత్రం తెరకెక్కడం అంటే మాటలు కాదు. అది రాజమౌళికే సాధ్యమయ్యింది. ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలకు పైగా అభిమానులు రోజులు లెక్కేసుకుంటున్నారు. ఆ క్షణాలు రానే వచ్చేసాయి. మరి కొద్ది గంటల్లో ఈ చిత్రం స్ధాయి ఏమటి అనేది తేలనుంది.

‘‘ప్రతి కథ అంతర్భాగంలో ఒక మహత్వం ఉంటుంది. మొత్తం ఇతివృత్తాన్ని అది నిర్వచిస్తుంది, ఆ ఇతివృత్తానికి ప్రేరకంగా ఉంటుంది. ‘బాహుబలి' హృదయం దాన్ని అనుసరిస్తుంది.. తన విధిని అతను నిర్వర్తించాలి, అది ఎలాంటిదైనా'' అంటూ రాజమౌళి ఈ చిత్రం గురించి తొలిగా చెప్పారు. అక్కడ నుంచే అంచనాలు మొదలయ్యాయి.


Photos : Crowd Waiting To Take Tickets For The Movie Baahubali


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అందుతున్న సమాచారం ప్రకారం...చిత్రం కథ మొత్తం ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడుస్తుంది. ప్రభాస్ శివుడు క్యారెక్టర్ ...తాను ఎవరు అని తెలుసుకునే క్రమంలో తన తండ్రి అమరేంద్ర బాహుబలి గురించి తెలుసుుకుంటాడు. అంతేకాదు తన తండ్రి మరణానికి కారణం ...భళ్లారి దేవ (రానా) అని తెలుసుకుని, తన రాజ్యాన్ని సొంతం చేసుకుని తన ప్రజలను అతని బారి నుంచి ఎలా కాపాడాడు అనే దిశగా నడుస్తుంది.


స్లైడ్ షోలో మిగతా ప్రివ్యూ


టెక్నికల్ గా ఇలా ..

టెక్నికల్ గా ఇలా ..

ఇది లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా.


విజువల్స్ బ్లూ మ్యాట్ తో ..

విజువల్స్ బ్లూ మ్యాట్ తో ..

ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.


8 పాత్రలు చుట్టూ..

8 పాత్రలు చుట్టూ..

ఈ సినిమాలో 8 పాత్రలు దేనికవే ప్రత్యేకం, ది బెస్ట్ అనిపించుకునేలా ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది. ఆ పాత్రలే బాహుబలి, శివుడు, భళ్లాలదేవ, శివగామి, అనామిక, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ. ఈ 8 పాత్రలని ఆడియన్స్ అంత తొందరగా మరచిపోలేరని అంటున్నారు.


ఇప్పటికే...

ఇప్పటికే...

ఫైనల్ కాపీ ఇప్పటికే అన్ని ప్రాంతాలకు చేరుకుంది. దాంతో నిర్మాతలు ఊపరి పీల్చుకున్నారు.ప్రిమియర్ షోకు విపరీతమైన ఆదరణ

ప్రిమియర్ షోకు విపరీతమైన ఆదరణ

ప్రతి చోటా ఈ సినిమా టికెట్స్ మరియు ప్రీమియర్స్ షోస్ టికెట్స్ భారీ రేటుకు అమ్ముడు పోతున్నాయి.తొలి బెనిఫిట్ షో

తొలి బెనిఫిట్ షో

హైదరాబాద్ లో ... మొదటిగా మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో వేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా బెసిఫిట్ షోకి సంబందించిన టికెట్స్ జోరుగా అమ్ముడు పోతున్నాయి.


బెనిఫిట్ షో కు ప్రముఖులు అంతా..

బెనిఫిట్ షో కు ప్రముఖులు అంతా..

శ్రీరాములు థియేటర్ లో పడనున్న మొదటి షోకి ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.ముఖ్యంగా ఈ బెనిఫిట్ షో కు

ముఖ్యంగా ఈ బెనిఫిట్ షో కు

ఈ షోకు సునీల్, నాగ శౌర్య, దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కానున్నారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖులే హాజరు కానున్నారు.ఎన్ని థియేటర్లు

ఎన్ని థియేటర్లు

మొత్తం నాలుగు భాషల్లో కలిపి ఈ సినిమా 4000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.యుఎస్ లో రికార్డు

యుఎస్ లో రికార్డు

అన్ని ఏరియాలు కలుపుకుని ఐదు వేలుకు పైగానే టిక్కెట్లు యుఎస్ లో అమ్ముడయ్యాయి. ఇది రికార్డు తెరముందు

తెరముందు

శివునిగా, బాహుబలిగా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో భల్లాలదేవ పాత్రలో రానా, దేవసేన పాత్రలో అనుష్క, అవంతిక పాత్రలో తమన్నా కనిపించనున్నారు.తెరవెనుక

తెరవెనుక

బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్‌
నటీనటులు: ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అడివి శేష్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు
కథ: వి. విజయేంద్రప్రసాద్‌,
సంగీతం: ఎం.ఎం. కీరవాణి,
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌కుమార్‌,
సంభాషణలు: సిహెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ జి.,
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.
ఆర్ట్ డైరక్టర్: సాబుశిరిల్‌
కాస్ట్యూమ్స్‌ :రమా రాజమౌళి
యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్
విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌: వి.శ్రీనివాస్ మోహన్
నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ
సమర్పణ: కె. రాఘవేంద్రరావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి
విడుదలైన తేదీ: 10,జూలై 2015


English summary
Produced by Shobu Yarlagadda of Hyderabad-based Arka Mediaworks, “Baahubali,” however, has been engineered to be a nationwide sensation on its own terms – without need for a Bollywood retread. Each corralling massive social media followings, Prabhas (Varma) is the film’s lead star, while SS Rajamouli is its director. Other top cast include Rana Daggubati and Anushka Shetty.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu