»   » రాజమౌళి ..కొత్త ప్రయోగం, సక్సెస్ అవుతుందా?

రాజమౌళి ..కొత్త ప్రయోగం, సక్సెస్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఇప్పటికే ప్రపంచ ప్రేక్షకులను అలరించి ఘన విజయం సాధించిన 'బాహుబలి'ఓ కొత్త టెక్నాలిజీతో మన ముందుకు రాబోతోంది. ప్రపంచ సినిమా కనుక్కున్న సరికొత్త శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)తో ఈ సినిమా జతగట్టబోతోంది రాబోతోంది. 'బాహుబలి' దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.

'బాహుబలి: ది కంక్లూజన్‌'తోపాటు...అదే సమయంలో వీఆర్‌ వెర్షన్‌ 'బాహుబలి'ని కూడా సిద్ధం చేస్తున్నారు. కేన్స్‌ చలనచిత్రోత్సవంలో ఓ బాలీవుడ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు రాజమౌళి.రాజమౌళి మాట్లాడుతూ... 'బాహుబలి: ది కంక్లూజన్‌' పనులు శరవేగంగా జరగుతున్నాయి. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సరికొత్త విధానంలో ఇంకో 'బాహుబలి'ని అందించబోతున్నాం. వర్చువల్‌ రియాలిటీ ద్వారా 'బాహుబలి'ని ప్రేక్షకులకు కొత్తగా చూపించబోతున్నాం అని చెప్పారు.


రాజమౌళి ఇంకే మాట్లాడారు అనేది స్లైడ్ షోలో చూడండి...


ఒక్కటే కాదు...

ఒక్కటే కాదు...

అలాగని ‘బాహుబలి' సినిమా కథ... ఇదీ ఒక్కటి కాదు. కేవలం ప్రధానపాత్రలే ఇందులో కొనసాగుతాయి అని అన్నారు.


రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం నా సోదరుడు ఏఎండీ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రాజా కోడూరి ఈ వర్చువల్‌ రియాలిటీ గురించి చెప్పారు.విన్నప్పటినుంచీ..

విన్నప్పటినుంచీ..

దీని ద్వారా ప్రేక్షకులకు మంచి కథ చెప్తే ఎలా ఉంటుందనిపించింది? అయితే అనుకున్నంత సులభంగా సినిమా కథను దీని ద్వారా చెప్పలేం అనిపించింది.అందుకే ఈ ఆలోచన

అందుకే ఈ ఆలోచన

ఈ టెక్నాలిజీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ విధానంలో ఓ సినిమా తీస్తే బాగుంటుందనిపించింది. అలా వీఆర్‌ ‘బాహుబలి' ఆలోచన చేశాం.మేమే తొలిసారి

మేమే తొలిసారి

వీఆర్‌ పరిజ్ఞానంతో ప్రపంచంలో తొలిసారిగా మేమే సినిమా రూపొందిస్తున్నాం.అంతా కంప్యూటరే..

అంతా కంప్యూటరే..

సాధారణంగా... సినిమా తీస్తున్నప్పుడు కెమెరా యాంగిల్‌, ఎడిటింగ్‌ తదితర అంశాలపై అవగాహన ఉంటుంది. అదే వీఆర్‌ సినిమా దగ్గరకు వచ్చేసరికి అంతా కంప్యూటర్‌ పనే.అంత ఈజీకాదు

అంత ఈజీకాదు

నాకో వంద అడుగుల విగ్రహం కావాలి, అది ఇలా వాలిపోవాలి, చుట్టూ చిన్న చిన్న ముక్కలు గాల్లో ఎగరాలి లాంటి అంశాలను సినిమాలో చూపించడం సులభం. అదే వీఆర్‌లో అయితే అంత సులభంకాదు.కథే కీలకం

కథే కీలకం

సినిమాలు తీయడానికి టెక్నాలిజీ ఒక్కటే సరిపోతుందా అనుకోవచ్చు. ఎన్ని రకాల పరిజ్ఞానాలు వచ్చినా కథే కీలకం. అది ఉంటే మనం ఎన్ని రకాల హంగులైనా అద్దొచ్చు.స్పెషాలిటీ

స్పెషాలిటీ

వీఆర్‌ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఆయా పాత్రల మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. దీంతో ఎమోషన్స్, వినోదం పండే తీరు మారుతుంది. వెండితెరపై చూపించలేని ఎన్నో ఆలోచనల్ని వీఆర్‌ ద్వారా చూపించొచ్చు.


అనుకోనక్కర్లేదు

అనుకోనక్కర్లేదు

వందలమంది కలసి ఒకే దగ్గర కూర్చొని సినిమా చూసే ఆనందాన్ని వీఆర్‌ సినిమా వల్ల కోల్పోతామేమో అనుకోనక్కర్లేదు.రీప్లేస్ చేయలేం

రీప్లేస్ చేయలేం

ఎందుకంటే సినిమా, టీవీ, మొబైల్‌, వీఆర్‌... దేనికదే వేరు. సినిమాను దేనితోనూ రీప్లేస్‌ చేయలేం.వేర్వేరుగా..

వేర్వేరుగా..

70 ఎం.ఎం. తెరపై చూసే సినిమాను టీవీలోనో, మొబైల్‌లోనో చూస్తే ఆ అనుభూతి రాదు. అలాగే వీఆర్‌లో చూసిన అనుభూతి పెద్ద తెరపై రాదు. అందుకే ఈ రెండింటినీ వేరుగా చూడాలి.అనుభూతి

అనుభూతి

ఇంకా చెప్పాలంటే ‘బాహుబలి'లో యుద్ధం సన్నివేశం చూస్తుంటే ప్రేక్షకుడికి యుద్ధరంగం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుందన్నమాట.


పెట్టుకుంటేనే

పెట్టుకుంటేనే

వీఆర్‌ పద్ధతిలో ప్రత్యేకంగా చిత్రీకరించిన సీన్స్ ను వీఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుంటేనే చూడగలం.హెడ్ సెట్ లో

హెడ్ సెట్ లో

ఆయా సీన్స్ ను డౌన్‌లోడ్‌ చేసుకున్న మొబైల్స్‌ను వీఆర్‌ హెడ్‌సెట్‌లో పెట్టుకునే ఏర్పాటు ఉంటుంది.త్రీడిలో చూసిన

త్రీడిలో చూసిన

అప్పుడా మొబైల్‌లో సీన్స్ రెండు కళ్లకు వేర్వేరుగా డిస్‌ప్లే అవడం ద్వారా ప్రేక్షకుడికి త్రీడీలో చూస్తున్న అనుభూతి కలుగుతుంది.మనం ఉన్నట్లే...

మనం ఉన్నట్లే...

360 డిగ్రీల కోణంలో చిత్రీకరించడంతో ఆ ప్రాంతంలో మనం ఉన్నట్లే ఉంటుంది. అదే ఈ టెక్నాలిజీ ప్రత్యేకతరెండేళ్లు

రెండేళ్లు

ఈ టెక్నాలిజీ ఇక్కడకి వచ్చేసరికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా.English summary
Rajamouli says that "Baahubali 2" will be released in theatres as a film but along with this he is also "directing" VR version which will be unveiled separately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu