»   » 'బాహుబలి' : అబ్రాడ్ ప్రేక్షకులకోసం స్పెషల్ గా ఇలా...

'బాహుబలి' : అబ్రాడ్ ప్రేక్షకులకోసం స్పెషల్ గా ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటోంది. ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది. ఇప్పుడా సినిమాని ..జూలై 10న తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ.... ''ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకొన్నా. నా సినిమాల్లో ప్రతినాయకులకు చాలా ప్రాధాన్యముంటుంది. తను ఎంత బలంగా ఉంటే... కథానాయకుడి పాత్ర అంత బలంగా ఎలివేట్‌ అవుతుంది. అందుకే ప్రభాస్‌కంటే ఎత్తు, ప్రభాస్‌ కంటే బలంగా ఉన్న నటుడు కావాలనుకొన్నా. ఆ సమయంలో నాకు రానానే గుర్తొచ్చాడు. ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మళ్లీ ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'కథానాయకుడిగా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా.


ఇలాంటి సమయంలో ప్రతినాయకుడిగా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అన్నానో... అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను. రెండుమూడు గంటలు ఆలోచించుకొని 'నేను భళ్లాలదేవాగా నటించడానికి సిద్ధమే' అన్నాడు. పైకి అలా కనిపిస్తాడుగానీ మనిషి చాలా సున్నితం. ఈ సినిమా ముగిశాక మా అందరికీ ఓ ఉత్తరం రాశాడు. ఈ టీమ్‌తో తనకున్న అనుబంధం పంచుకొన్నాడు. ఆ లెటర్‌ చూశాక మాకు కన్నీళ్లు ఆగలేదు. తనలో మంచి రచయిత ఉన్నాడనిపించింది. అందుకే 'బాహుబలి2'కి రచయితగా పనిచేయమని చెప్పా.


Rajamouli's Baahubali to Have Subtitles Abroad

ప్రభాస్‌.. ఓ మంచి డార్లింగ్‌. ఈ సినిమాపై మా అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకొన్నది తనే. నిరాశలో ఉన్నప్పుడు దర్శకుడ్ని నిలబెట్టేవాడు కావాలి. అలా నన్ను నిలబెట్టాడు ప్రభాస్‌. ఆరేళ్ల కిత్రం 'బాహుబలి' ఆలోచన వచ్చింది. నాలుగేళ్ల క్రితం లైన్‌ చెప్పా. మూడేళ్ల కిత్రం పూర్తి కథ వినిపించా. రెండేళ్ల క్రితం 'నీ డేట్స్‌ ఓ యేడాది పాటు కావాలి' అని అడిగా. 'రెండేళ్లు తీసుకో డార్లింగ్‌' అని ఇచ్చేశాడు.


'నువ్వు తీస్తున్నది మామూలు సినిమా కాదు. ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా..' అంటూ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ అండగా నిలిచాడు. రమ్యకృష్ణ గారి నటన మమ్మల్ని మరింత ఉత్సాహాన్నిచ్చింది. శివగామి పాత్ర కథలో చాలా కీలకమైనది. రమ్యకృష్ణలాంటి నటిని పక్కనే ఉన్నా మేం మొదట్లో ఎక్కడెక్కడో తిరిగాం. నాజర్‌, సత్యరాజ్‌ దర్శకుడికి విలువనిస్తూనే ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు.


తమన్నా ప్రొఫెషనలిజం ఆకట్టుకుంది. బల్గేరియాలో ఎముకలు కొరికే చలిలో ఓ సన్నివేశం కోసం దుస్తులు మార్చాల్సి వచ్చింది. చుట్టూ నాలుగు గుడ్డ ముక్కలు అడ్డుపెట్టుకొని దుస్తులు మార్చుకొని కెమెరా ముందుకొచ్చింది. నేను మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించే కథానాయిక అనుష్క. ఇక నా కుటుంబం గురించి చెప్పాలి.


నా భార్య రమ నా వెనుక లేకపోతే.. ఈ సినిమా తీయగలిగేవాడ్ని కాదు. పేరుకు వదిన కానీ... వల్లిగారు మా అమ్మ. ఆమె ఈ సినిమాకి ఓ పిల్లర్‌. అన్నయ్య కీరవాణి లాంటి సంగీత దర్శకుడు ఇంకెవ్వరికీ దొరకరు. నా సినిమాల్లోని డ్రమటిక్‌ సన్నివేశాలు మీ అందరికీ నచ్చుతున్నాయంటే కారణం.. మా నాన్నగారి నుంచి నేను నేర్చుకొన్న విద్యే. మా అబ్బాయి కార్తికేయ అన్నీ తానై చూసుకొన్నాడు'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
‘Baahubali – The Beginning’ will have subtitles, to cater to foreigners and non native speakers of Telugu, Tamil and Hindi. The film is getting ready for a massive release on July 10th across the world.
Please Wait while comments are loading...