»   » నిజంగా అంత ఇస్తారా? బాహుబలి-2 రాజమౌళి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్!

నిజంగా అంత ఇస్తారా? బాహుబలి-2 రాజమౌళి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మగధీర సినిమాతో టాలీవుడ్లో తన సత్తా ఏమిటో నిరూపించుకున్న దర్శకుడు రాజమౌళి... ఆ తర్వాత 'ఈగ' సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. 'బాహుబలి'తో రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాడు.

'బాహుబలి' చిత్రం ఇంటర్నేషనల్‌గా వర్కౌట్ కాక పోయినా... దేశీయంగా రాజమౌళికి ఎనలేని కీర్తి తేవడంతో పాటు అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి... ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందంటే అందుకు ప్రధాన కారణం కేవలం రాజమౌళి మాస్టర్ మైండ్ అని చెప్పక తప్పదు. రాజమౌళి అనే దర్శకుడు లేకుంటే ఈ రోజు బాహుబలి అనే ఒక విజువల్ వండర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలు ఉండేదికాదు.

మరి అలాంటి రాజమౌళి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అనేది ముందు నుండీ చర్చనీయాంశమే. తొలి భాగానికి రాజమౌళికి రెమ్యూనరేషన్ గా రూ. 30 కోట్ల వరకు అందినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి బాహుబలి-2 చిత్రానికి ఆయన ఎంత తీసుకుంటున్నారు? కేవలం రెమ్యూనరేషన్ మాత్రమేనా? లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారా? అనే వివరాలు స్లైడ్ షోలో...

భారీ డీల్

భారీ డీల్

బాహుబలి తొలి భాగం గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో భాగానికి రాజమౌళి నిర్మాతలతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.

సగం వచ్చేలా..

సగం వచ్చేలా..

బాహుబలి 2 సినిమాను తెలుగులో తప్పించి మిగిలిన అన్ని చోట్లా ఎంతకి అమ్ముతారో ఆ రేటులో లో తనకు సగం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.

రాజమౌళికి ఎంత వస్తుందా?

రాజమౌళికి ఎంత వస్తుందా?

బాహుబలి హిందీ, తమిళం, మళయాళం రైట్స్ అంతా కలిపి రూ. 150 నుండి 200 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం రాజమౌళికి దాదాపు రూ. 75 నుండి రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతుందని అంచనా.

బాహుబలి-2

బాహుబలి-2

బాహుబలి-2 సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మాహిష్మతి రాజ్యం

మాహిష్మతి రాజ్యం

మాహిష్మతి రాజ్యాన్ని తొలి భాగంలో మాదిరిగా కాకుండా పార్ట్ 2లో సరికొత్తగా చూపించబోతున్నారు.

వందల మంది..

వందల మంది..

బాహుబలి-2 లో కొత్తగా వేస్తున్న సెట్టింగ్స్ కోసం దాదాపు 500 మంది రాత్రింభవళ్లు కష్టపడుతున్నారట.

అంచనాలు భారీగా..

అంచనాలు భారీగా..

బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అందుకు తగిన విధంగానే..

అందుకు తగిన విధంగానే..

సినీ ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టడంలో, వారి అంచనాలను అందుకోవడంలో రాజమౌళి ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. ఇపుడు పార్ట్ 2 విషయంలోనూ అందుకు తగిన స్టఫ్ తో ఆయన ముందుకు సాగుతున్నారు.

English summary
After the release of ‘Baahubali’, Rajamouli has reworked with producers and is said to have asked them to give 50 percent share in the business of ‘Baahubali 2’ excluding the Telugu rights. In other words, Rajamouli will be gaining 50 percent of business done for the Tamil, Hindi versions and as well as Malayalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu