Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: మళ్లీ ప్రధానిగా మోడీనే, ఎన్డీఏకు 321 సీట్లు, కరోనాపై పోరు భేష్!
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చివరి దశలో 'బాహుబలి' ...కీ సీన్స్ షూటింగ్
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తీర్చిదిద్దుతున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రం 'బాహుబలి'. ఒకటిన్నర సంవత్సరం నుంచి విరామం లేకుండా చేస్తున్న చిత్రీకరణ చివరి దశకొచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పాలసముద్రం, నార్త్ సిటీ, బీఎస్‌ఎఫ్ షెడ్లు, విలేజ్ స్ట్రీట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీటిలో ప్రభాస్ తదితరులు పాల్గొంటున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఇటీవల విడుదల చేసిన 'విజువలైజింగ్ ది వరల్డ్ ఆఫ్ బాహుబలి' వీడియోకు వచ్చిన స్పందన పట్ల యూనిట్ సంతోషంగా ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.

ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ''బాహుబలి'' కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను తీసుకోస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం నుంచి షూట్ చేస్తారని సమాచారం. ప్రభాస్, రానా , అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
బల్గేరియాలోని భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్‌దేవ్ ‘బాహుబలి' టీమ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇటీవల బల్గేరియాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బల్గేరియాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్‌దేవ్ తన కుటుంబంతో కలిసి ‘బాహుబలి' సెట్స్‌ని సందర్శించారు. పోరాట సన్నివేశాల్ని, సెట్స్‌ని చూసి ఆశ్చర్యపోయారు.
ప్రభాస్, తమన్నా, రాజమౌళితోపాటు మా టీమందరితో మాట్లాడారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకుని చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు'' అని తెలిపారు. సినిమా షెడ్యూల్ గురించి వివరిస్తూ ‘‘సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్యాచ్‌వర్క్, మైనర్ టాకీ, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజా షెడ్యూల్‌ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: యం.యం.కీరవాణి.