రామకృష్ణా స్టూడియోస్ లో రాజమౌళి
హైదరాబాద్ : రాజమౌళి ప్రస్తుతం హైదరాబాద్ లోని రామకృష్ణా స్టూడియోస్ లో బిజీగా ఉన్నారు. అక్కడ ఆయకేం పని అంటారా...ఆయన తన తాజా చిత్రం బాహుబలి కి సంభందించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ మీద ఆ సీన్స్ ప్లాన్ చేసి తీస్తున్నారు. రమ్య కృష్ణ, సత్యరాజ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.
మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరుగా జరుగుతోంది. ఓవర్ సీస్ బిజినెస్ సైతం పూర్తైంది. ఏప్రియల్ 2015 లో విడుదల అయ్యే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ తొమ్మిది కోట్లు తొలి భాగం మేరకే అని చెప్తున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.
రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దాంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











