పవన్ వాడిన కారు నెంబర్ రాజమౌళిదే, ఇదిగో సాక్ష్యం!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశం అయింది. ఈచిత్రంలో ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ తన అత్త(నదియా) ఇంటి వరకు కార్ల కాన్వాయ్‌లో వచ్చి....అక్కడ దిగేసి డ్రైవర్ అవతారంలో మారుతాడు.
ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వాడిన కారు నెంబర్ (AP09CM1122) ప్రముఖ దర్శకుడు రాజమౌళిదే అని ఆర్‌టిఏ రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన రిజస్ట్రేషన్ వివరాలు ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే సినిమాలో వాడిని జాగ్వార్ కారుకు రాజమౌళి టయోటా కారు పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ వాడినట్లు స్పష్టం అవుతోంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి చిత్రం నిర్మించడంతో పాటు, మగధీర చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా పని చేసారు.
వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే రాజమౌళి కారు నెంబర్ 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ కోసం వాడినట్లు స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోను మీరు ఇక్కడ చూడొచ్చు. పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబినేషన్ సినిమా రావాలని అంతా కోరుకుంటున్న తరుణంలో ఈ వార్తకు ఎక్కువైంది.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












