»   » రాజమౌళి.... రోజూ ఏం తింటారో తెలుసా? (లిస్ట్)

రాజమౌళి.... రోజూ ఏం తింటారో తెలుసా? (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉంటారు. ‘బాహుబలి' సినిమాను ఆయన ఒక యజ్ఞంలా చేస్తున్నారు. దాదాపు మూడేళ్లు కేవలం ఆయన ఈ సినిమా కోసమే కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కెప్టెన్ ఆయనే కాబట్టి అన్ని విషయాలను దగ్గరుండి చూసుకోవాలి. పని ధ్యాసలో పడితే ఆయన అసలు తిండి విషయం పట్టించుకోరు. మరి కెప్టెన్ ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రాజెక్టు సవ్యంగా ముందుకు సాగేది. అందుకే ఆయన డైట్ విషయం చూసుకోవడానికి ఎల్.ఇ.ఎన్ మూర్తి అనే కేర్ టేకర్ ను నియమించారు. ఇటీవల ఆయన రాజమౌళి ఫుడ్ మెను గురించిన వివరాలు వెల్లడించారు.

రాజమౌళి రోజూ ఉదయం 6 గంటలకు ఒక యాపిల్ పండు తింటారు. టీ, కాఫీలకు దూరంగా ఉంటారు. 7 గంటలకు బొప్పాయి పండు తింటారు. 10 గంటలకు కొబ్బరి నీళ్లు తాగుతారు. 11 గంటలకు పండ్ల రసం తాగుతారు. లంచ్ సమయానికి ఇంటి భోజనం తీసుకుంటారు. మళ్లీ 4 గంటలకు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటారు. రాజమౌళికి చికెన్ అంటే చాలా ఇష్టం. వారంలో నాలుగు రోజులు చికెన్ తింటారు.


Read More : ఎక్సట్రార్డనరీ : 'బాహుబలి' భారీ సెట్స్ డిజైన్స్ ఇవిగో (ఫొటోలు)


Rajamouli's diet revealed

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మళయాలం, ఇంగ్లీష్ తో పాటు ఇతర విదేశీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇదో గ్రేట్ సినిమా అవుతుందని అంటున్నారు. మరి ఈచిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందనే విషయం జులై 10న తేలనుంది.

English summary
SS Rajamouli is so passionate about cinema that he don't even bother about food while he was on the sets. LEN Murthy is his caretaker when it comes to intake of food and this man reveals the 'menu' of the most successful Tollywood filmmaker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu