ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ‘ఈగ’
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రానికి యూఎస్ఏలో బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. బాషా బేదం లేకుండా ఈచిత్రాన్ని భారతీయ ఎన్నారైలు అంతా చూస్తున్నారు. ఎందుకంటే ఈచిత్రం విజువల్ వండర్. ఈ నేపథ్యంలో ఇతర భాషల ప్రేక్షకుల సౌకర్యార్థం ఈ చిత్రాన్ని అక్కడ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మెసేజ్ అందింది. ఈ శనివారం(జూలై 21) నుంచి యూఎస్‌లోని ముఖ్య పట్టాణాలైన న్యూజెర్సీ, వర్జీనియా, చికాగో, అట్లాంటా, బే ఏరియా, లాస్ ఏంజిల్స్, ఫీమౌంట్, కాలిఫోర్నియాల్లో సబ్ టైటిల్స్‌తో కూడిన ప్రదర్శన మొదలువుతుందని' రాజమౌళి ట్వీట్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రాజమౌళి ఈచిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో హీరో ఈగనే కావడం మరో విశేషం. చిన్న ఈగ క్రూర స్వభావం గల మనిషిపై ఎలా పగ తీర్చుకుంది అనే విషయాన్ని చాలా ఆసక్తిరంగా చూపించారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ముఖ్య భూమిక పోషించాయి. రాజమౌళి అద్భుతమైన దర్శకత్వానికి తోడు సుదీప్ నటన మూవీకి హైలెట్ అయ్యాయి.
అమెరికాలో ఈగ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌కు తగిన విధంగా గత వారం నుంచే స్ర్కీన్ల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటికే ఈగ చిత్రం తెలుగు టాప్ హీరోల రికార్డులను బద్దలు కొడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మించారు. సంగీతం : కీవాణి, సమ్పరణ : డి. సురేష్ బాబు


Click it and Unblock the Notifications











