రాజమౌళి ‘ఈగ’- వ్యూవర్స్ రివ్యూ...
రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసింది. క్రిటిక్స్ అంతా ఈచిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చారు. మరో వైపు ఈచిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూడటానికి వెళ్లేవారికి ఈచిత్రం మెస్మరైజ్ అనుభూతిని కలిగిస్తోంది. రాజమౌళి దర్వకత్వం, సుదీప్ నటన, స్టన్నింగ్ విజువల్స్ గొప్ప అనుభూతినిస్తున్నాయి.
ఈగ చిత్రం చూసిన చాలా మంది తమ ఫీలింగ్స్ వ్యక్త పరుస్తూ వన్ ఇండియాకు తమ కామెంట్స్ పంపారు. అందులో కొన్ని ఎంపిక చేసిన కామెంట్స్ మీకోసం....
పండల పద్మారావు: ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన కంప్లీట్ విజులవల్ ట్రీట్ ఈచిత్రం. అతను కేవలం దర్శకుడు మాత్రమే కాదు, అతను తెలుగు సినిమా కీర్తిని ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్లగలిన బ్రాండ్ అంబాసిడర్. సినిమానే ఫ్యాషన్‌గా రాజమౌళి జీవిస్తున్నారు. ఆయన పనితనానికి 'ఈగ'చిత్రం ఓ మచ్చు తునక.
గౌతం : మాటల్లో చెప్పలేనంత సూపర్ గా ఉంది ఈగ చిత్రం. హాట్సాఫ్ రాజమౌళి అండ్ కీరవాణి. తెలుగు సినిమా దర్శకులు టాలెంట్ ఏమిటో చాటారు.
కరణం శేషగిరిరావు : రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రం ఓ ఎక్సలెంట్ ప్రొడక్ట్. మంచి స్టోరీలైన్, సూపర్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అదిరింది. టెక్నికల్ అంశాలు, గ్రాఫిక్స్ పర్ ఫెక్టుగా ఉన్నాయి. కిచ్చా సుదీప్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఈచిత్రం తప్పకుండా చాలా అవార్డులు గెలుచుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈచిత్రం అమితంగా ఆకట్టుకుంటోంది. తప్పకుండా ఈచిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
ఆర్ ఎస్ నాయుడు : ఎక్సలెంట్ మూవీ, సుదీప్ రాక్స్, కీపిట్ అప్ రాజమౌళి
రవి : ఈగ లాంటి అద్భుతమైన చిత్రం ఇచ్చినందుకు ఇండియా గర్వపడుతోంది. ఇండియన్స్ కూడా వండర్స్ సృష్టించగలరని రాజమౌళి నిరూపించారు.
సుందర్ : కిచ్చా సుదీప్ రాక్స్. ఈగ టీం మొత్తానికి కంగ్సాట్స్ ముఖ్యంగా రాజమౌళికి.
వెంకటేశ్వర్లు : ఎక్సలెంట్ మూవీ, గ్రాఫిక్స్ అమేజింగ్, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.
నటరాజ్ : మూవీ సూపర్...కర్నాటక సుదీప్ రాక్స్. ఆల్ ఓవర్ కర్నాటక థియేటర్లన్నీ హౌస్ ఫుల్, రాజమౌళికి ధన్యవాదాలు. సుదీప్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. అతను మాత్రమే ఆ క్యారెక్టర్ చేయగలడు.
సుచిత్ర : ఈగ సినిమా సూపర్..రాకింగ్. రాజమౌళికి కంగ్రాట్స్, నాని, సమంత, సుదీప్‌లకు ఆల్ ది బెస్ట్
శ్రీకిరణ్ : ఈగ చిత్రం నిజంగా అమేజింగ్. ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుంది.
సాగర : ఇలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు రామౌళికి థాంక్స్. సుదీప్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్. ఆల్ బెస్ట్ టు కిచ్చా సుదీప్. ఈ చిత్రం సుదీప్ వన్‌మెన్ షో.
కిరణ్ ఆర్ : భారతీయ చిత్రాల్లో ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతమైన చిత్రాలు రాలేదు. శంకర్ రోబో చిత్రం తీసినప్పటికీ రజనీ వల్లనే ఆ చిత్రం అంత హిట్టయింది. కానీ కేవలం రాజమౌళి వల్ల మాత్రమే ఈగ చిత్రం ఇంత పెద్ద హిట్టయింది. కావాలంటే బెట్ కాస్తా...
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











