రాజమౌళి 'మర్యాద రామన్న' ఆడియో లాంచ్ విశేషాలు

By Srikanya

హైదరాబాద్ శిల్పకళా వేదికపై నిన్న(జూలై 4)న రాజమౌళి లేటెస్ట్ మర్యాదరామన్న చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగింది. రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుల పూర్వీకుల కట్టిన ఇల్లు లాంటి సెట్ లో ఈ చిత్రం ఆడియో వెరైటీగా జరిపారు. అలాగే సినిమా కథను గుర్తు చేసేలా ఈ ఆడియో పంక్షన్ ధీమ్ ని ప్లాన్ చేసారు. మొదటిగా ఆ ఇంటి ముందు కిటికీ వద్ద ఓ అమ్మాయి నిలబడి లోపల ఉన్న వారిని బయిటకు రమ్మని చెపుతుంది. అయితే ఎవరూ బయిటకు రారు. ఇంతలో చిత్రానికి కథ,మాటలు అందించిన కాంచి ముందుకు వచ్చి..అమ్మాయి కిటికీ ప్రక్కన కూర్చుంది అని అనటంతో...ఆ చిత్రంలోని అమ్మాయి కిటికీ ప్రక్కన నిలుచుంచి అనే పాటను ప్లే చేసారు.

ఆ తర్వాత యాంకర్ సుమ వచ్చి...అది గండికోటలోని ప్రముఖ ప్యాక్షనిష్టు రామినీడు గారి ఇల్లు అని అందరినీ ఆహ్వానించింది. ఇక ఆ ఇంటి గుమ్మంలోంచి రాజమౌళి, నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, కీరవాణి, సిరివెన్నెల, కాంచి,రమా రాజమౌళి వంటి అందరూ బయిటకు వచ్చారు. ఇక చివరగా సునీల్ ని రమ్మని అంటే అతను గమ్మం వరకూ వచ్చి ఆగిపోయాడు. రమ్మంటే బయిటకు రాకుండా లోపల ఏదో మర్చిపోయాను అంటూ భయపడుతూ వెళ్ళిపోయాడు.

అప్పుడు డి.సురేష్ బాబు, యస్పీ బాలసుబ్రమణ్యం, దాసరి, కె రాఘవేంద్రరావు వంటివారు వచ్చి బుజ్జగిస్తూ బయిటకు పిలవనారంభించారు. అయినా ఫలతం లేదు. అప్పుడు చివరగా జూ ఎన్టీఆర్ వచ్చి..ఏయ్ సునీల్ బయిటకు వస్తావా తన్నమంటావా అని గర్జించి పిలిచారు. ఆ తర్వాత ప్రభాస్ వంటి హీరోలు కూడా ప్రయత్నం చేసారు. ఇలా ఫన్నీగా చేసి చివరకు దాసరి నారాయణ రావు చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసారు. తొలి సిడిని కె రాఘవేంద్రరావుకు అందచేసారు.

అనంతరం దాసరి మాట్లాడుతూ...దర్శకుడు అనేవాడు ఎప్పుడూ పెద్ద హీరోలతోనే పెద్ద సినిమాలే కాకుండా అప్పుడప్పుడు చిన్నవారితో కొత్త వారితో కూడా సినిమాలు చేయాలని చెప్తూంటాను. దాన్ని రాజమౌళి చేసి చూపించాడు. ఈ సినిమా అన్ని రికార్డులు తిరగరాస్తుంది. అలా జరిగితే దర్శకుడుగా నేను తలఎత్తుకుంటాను అన్నారు. ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ...అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక ఈ పంక్షన్ చివరలో కీరవాణి పుట్టినరోజు సందర్భంగా కేక్ ను కట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X