రాంచరణ్, ఎన్టీఆర్ చనిపోతారా.. ప్రాణ స్నేహితులు, రాజమౌళి మళ్ళీ అదే ఫార్ములా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కి సంబందించిన లీకులు ఆగడం లేదు. ఆర్ఆర్ఆర్ కథ ఇదే అంటూ అనేక ఊహాగానాలు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిగా స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరక్కుతోందని.. ఎన్టీఆర్ బందిపోటుగా, రాంచరణ్ పోలీసుగా కనిపిస్తాడని అంటున్నారు. తాజాగా ఈ చిత్ర కథ గురించి మరో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథలో రాజమౌళి ఊహించని విధంగా మెలిక పెట్టబోతున్నాడట.

ఎన్నో ఊహాగానాలు
రాంచరణ్, ఎన్టీఆర్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటారు. ఈ చిత్రంలో బాక్సింగ్ కి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఎన్టీఆర్, చరణ్ అన్న దమ్ములు.. కాదు స్నేహితులు ఇలా అభిమానులని గందరగోళానికి గురి చేస్తూ ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఈ చిత్రం గురించి ఎలాంటి విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. నవంబర్ లో ప్రారంభమైన ఈ చిత్రం అప్పుడే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఎన్టీఆర్, చరణ్ చనిపోతారా
తాజాగా ఈ చిత్ర కథ గురించి జరుగుతున్న ప్రచారం ఉత్కంఠని రేకెత్తిస్తోంది. రోమాలు నిక్కబొడుచుకునే ఎమోషన్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెకెక్కించబోతున్నారట. రాంచరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారట. 1930లో జరిగే స్వాతంత్ర ఉద్యమంలో చరణ్, ఎన్టీఆర్ భీకరమైన పోరాటం చేసి చివరకు వీరులుగా మరణిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేసాలకు రాజమౌళి తనదైన శైలిలో క్రియేటివిటీని జోడించబోతున్నారని సమాచారం.

పునర్జన్మతో స్నేహితులుగా
ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం.. స్వాతంత్ర ఉద్యమంలో మరణించిన చరణ్, ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి జన్మిస్తారట. 2000 సంవత్సరం నేపథ్యంలో మళ్ళి స్నేహితులుగా మారుతారని.. ఆ తరువాత ప్రజెంట్ కథ ప్రారంభం అవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

మళ్ళీ అదే ఫార్ములా
చూస్తుంటే ఇది రాజమౌళి బ్లాక్ బస్టర్ హిస్ చిత్రం మగధీరని తలపించేలా ఉంది. కానీ పునర్జన్మ అనే పాయింట్ మినహా మిగిలిన కథ మొత్తం భిన్నంగా ఉంటుందని అంటున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే కథానాయికల్ని రాజమౌళి ఇంకా ప్రకటించలేదు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











