ఆన్‌లైన్‌లో సినిమాలు: రాజమౌళి కొత్త వ్యాపారం
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తెలుగు సినిమా అభిమానులు ఉన్నారు. ఎంతో మంది తమ అభిమాన హీరోలు, దర్శకుల సినిమాలు రిలీజ్ రోజే థియేటర్లో చూడాలని అంనుకుంటారు కానీ అందరికీ అది సాధ్యం కావడం లేదు. ఇలాంటి వారి కోసం releaseday.com మంచి ఆప్షన్ అని అంటున్నారు.
ప్రస్తుతం ఆర్కామీడియా రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమా తెరకెక్కిస్తోంది. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటిరకు ప్రభాస్, రాణాలపై మాత్రమే షూటింగ్ జరిగింది. తాజాగా ఈ షూటింగులో అనుష్క కూడా జాయినైంది. ఆమెతో పాటు నటి రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కూడా షూటింగులో పాల్గొంటున్నారు. తొలి షెడ్యూల్ కర్నూలు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రభాస్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.


Click it and Unblock the Notifications












