»   » ఫైనల్ స్టేజికొచ్చేసింది: రాజమౌళి తర్వాతి సినిమాలో హీరో అతడే!

ఫైనల్ స్టేజికొచ్చేసింది: రాజమౌళి తర్వాతి సినిమాలో హీరో అతడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఆ సినిమాలో అవకాశం దక్కించుకోబోయే ఆ లక్కీ హీరో ఎవరు? అంటూ కొంతకాలంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కొన్ని రోజుల క్రితం రాజమౌళి నెక్ట్స్ మూవీ హీరో అల్లు అర్జున్ అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి.

కానీ రాజమౌళి మాత్రం తన తర్వాతి సినిమాలో హీరో ఎవరు? అనే విషయం ఇప్పటి వరకు వెల్లడించలేదు. తన స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తయి, సినిమా మొదలు పెట్టడానికి అంతా సిద్ధమైన తర్వాతే ఈ విషయాలను వెల్లడించాలనే యోచనలో రాజమౌళి ఉన్నారు.

Rajamouli’s next project is finalized with Jr NTR

రాజమౌళికి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... ఆయన తన తర్వాతి సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

బాహుబలి-2 తర్వాత తన సినిమా విషయంలో.... అందరిలోనూ ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. విషయం ముందే లీక్ చేస్తే మీడియాలో ఓవర్ పబ్లిసిటీ జరుగుతుందని, ఇది సినిమాపై మరో రకంగా ప్రభావం చూపుతుందనే కారణంతో రాజమౌళి ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నట్లు సమాచారం. అందుకే రాజమౌళితో పాటు తారక్ ఈ విషయమై ఎక్కడా బయట పడటం లేదని అంటున్నారు.

Rajamouli’s next project is finalized with Jr NTR

రాజమౌళి, తారక్ కాంబినేషన్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. పైగా ఇద్దరి మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. తమ కాంబినేషన్ అంటే ఏర్పడే భారీ అంచనాలకు తగిన రేంజిలో ఉండే సబ్జెక్టుతోనే త్వరలో ఇద్దరూ సినిమా ప్రారంభించబోతున్నారని, ఈ చిత్రానికి కథ విజయేంద్రప్రసాద్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Sources in industry that Rajamouli’s next project is finalized with Junior NTR and groundwork for the same is already initiated very confidentially.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu