యమధీర కాదు "బాక్సర్"?: రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ సినిమా లేటెస్ట్ అప్డేట్

తెలుగు సినీ ప్రియులకు మరచిపోలేని అనుభూతిని అందించేలా తన తరవాతి సినిమాను తయారు చేయాలని భావిస్తున్న రాజమౌళి దీనికి 'బాక్సర్' అన్న టైటిల్ కరెక్టుగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.

Recommended Video

యమధీర కాదట ! 'బాక్సర్' ?

టాలీవుడ్ లో లేటెస్ట్ హాట్ న్యూస్ గా నిలిచిన రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రం గురించి మరో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే సినిమా ఏమిటి అనే ప్రశ్నకు తెరపడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలయికతో మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. ఈ ముగ్గురు ఇటీవల కలిసి తీయించుకొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం రాబోతున్నదనే వార్త టాలీవుడ్‌నే కాదు.. ఇతర సినీ పరిశ్రమలను కూడా కుదిపేసింది.

విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్

తాజాగా ఈ వీరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రానికి సంబంధించిన కథపై ఇప్పటికే కథా రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేస్తున్నారనేది తాజా సమాచారం.

బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్న విషయం చక్కర్లు కొడుతున్న వేళ, అదే పేరును చిత్రానికి పెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలుగు సినీ ప్రియులకు మరచిపోలేని అనుభూతిని అందించేలా సినిమాను తయారు చేయాలని భావిస్తున్న రాజమౌళి దీనికి 'బాక్సర్' అన్న టైటిల్ కరెక్టుగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.

 ప్రతి చిన్న న్యూస్ వైరల్ అవుతోంది

ప్రతి చిన్న న్యూస్ వైరల్ అవుతోంది

ఈ సినిమాకు 'యమధీర' అని టైటిల్ పెట్టాలని అభిమానుల నుంచి సూచనలు అందుతున్న సంగతి తెలిసిందే. సినిమా కథేంటి? నటీనటులు ఎవరు? ఎంత బడ్జెట్ తో తీస్తున్నారు? టైటిల్ ఏంటి? అన్న విషయాల్లో ఎలాంటి అధికారిక న్యూస్ బయటకు రాకున్నా, ఈ సినిమాపై వచ్చే ప్రతి చిన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది.

150 కోట్లకుపైగానే

150 కోట్లకుపైగానే

ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.150 కోట్లకుపైగానే అనే మాట వినిపిస్తున్నది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్ర కావడంతో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలకు తగ్గినట్టే సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో జక్కన్న ప్రిపేర్ అవుతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X