RRR రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ! ఆ మాట చెప్పడంతో అంతా షాక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని, అనుకున్న సమయానికి RRR విడుదల కావడం కష్టమే అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వార్తలపై స్పందించారు జక్కన్న.

జూలై 30న RRR.. షూటింగ్ డిలే
డీవీవీ దానయ్య సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న RRR సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదలవుతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే షూటింగ్ డిలే కారణంగా అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలవడం కష్టమని, విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు షికారు చేశాయి.

జక్కన్న రియాక్షన్.. నేను తీయకూడదా?
కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా రాబోతున్న మత్తు వదలరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమౌళి వేదికపై మాట్లాడుతూ తన RRR సినిమా విడుదలపై ఆసక్తికరంగా స్పందించారు. `నా సినిమా 2020లో వస్తుందా? వాయిదా పడుతుందా? అని అడగొద్దు. వీళ్లే (మత్తు వదలరా) ఈ సినిమాను సంవత్సరంపాటు తీశారు.. నేను తీయకూడదా?` అని రాజమౌళి అన్నారు.

రాజమౌళి రియాక్షన్ చూసి షాక్..
రాజమౌళి స్పందించిన తీరు చూసి షాకయ్యారంతా. దీంతో జక్కన్న రియాక్షన్, వస్తున్న వార్తల ఆధారంగా RRR మూవీ జులై 30న రావడం కష్టమే అనే టాక్ జనాల్లో వచ్చేసింది. ఈ టాక్ మెగా, నందమూరి అభిమానులను కాస్త నిరుత్సాహ పరుస్తోంది.

2020 దసరా లేదా 2021 సంక్రాంతి
2020 జులై 30న కాకుండా అదే ఏడాది దసరా సమయానికి లేదా 2021 సంక్రాంతికి
RRR విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదలవుతుంది RRR మూవీ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఉన్నట్టుండి RRR మూవీ విడుదల తేదీపై చర్చ మొదలు కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

రామ రౌద్ర రుషితం
RRR సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications











