రిలీజ్‌కి ముందే సత్తా చాటుతున్న RRR.. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు సినీ పరిశ్రమ నుంచి RRR రూపంలో మరో భారీ సినిమా రాబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తాలూకు విషయాలు, ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ తెలిశాయి. వివరాల్లోకి పోతే..

రిలీజ్‌కి ముందే RRR.. ఎక్కడ చూసినా అదే చర్చ
బాహుబలి లాంటి భారీ సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడం, పైగా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు రామ్ చరణ్- ఎన్టీఆర్ నటిస్తుండటం RRR సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా అప్‌డేట్స్ ఒక్కటికూడా ఇవ్వకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని ఆతృతగా మార్చేశారు జక్కన్న. దీంతో ఏక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్..
ఈ నేపథ్యంలో తాజాగా RRR ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలియడం మరింత ఆసక్తి రేపింది. అన్ని ఏరియాల్లో RRR మూవీ ఓ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 200 కోట్ల బిజినెస్ చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది.

వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ హక్కులు.. ఎంటరైన దిల్ రాజు
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక్క నెల్లూరు ఏరియాలో తప్ప అన్ని ఏరియాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలిసింది. నైజాం ఏరియా హక్కలను దిల్ రాజు సొంతం చేసుకున్నారని సమాచారం. ఇకపోతే వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ హక్కులకు గాను 300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు రిపోర్ట్స్ అందాయి.

మెగా, నందమూరి అభిమానుల ఆశలు.. RRR రికార్డ్స్
ఈ లెక్కన చూస్తే ఇప్పటిదాకా బాహుబలి రికార్డ్స్ చెప్పుకుంటున్నాం. ఇక 2021 తర్వాత RRR రికార్డ్స్ చెప్పుకుంటాం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు మెగా, నందమూరి అభిమానులు ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు.. కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు.

RRR మూవీ.. టైటిల్ అదేనా?
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి ''రామ్ రౌద్ర రుషితం'' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. 2021 జనవరి 8న ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











