జైపూర్లో రాజమౌళి కుమారుడి వివాహం: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అనుష్క, రానా, నాని హాజరు (ఫోటోస్, వీడియో)

Recommended Video

Tollywood Stars In Jaipur For SS Rajamouli's Son's Wedding Exclusive Photos

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికయ పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 30న జైపూర్ సమీపంలోని కుకాస్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహ వేడుక జరుగబోతోంది. ఈ మేరకు రాజమౌళి కుటుంబంతో పాటు అతిథులు కుకాస్ వెళుతూ జైపూర్ ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్ చిత్ర పరిశ్రమల నుంచి దాదాపు 300 మంది గెస్టులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 29న మెహందీ, సంగీత్ వేడుక, డిసెంబర్ 30న పెళ్లి వేడుక జరుగనుంది.

ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె పూజతో కార్తికేయ వివాహం జరుగబోతోంది. కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్లో జరిగిన వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

జైపూర్ చేరుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని

కార్తికేయ వివాహ వేడుకలో పాల్గొనేందుకు టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని జైపూర్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్యామిలితో కలిసి హాజరైన ఎన్టీఆర్

ఫ్యామిలితో కలిసి హాజరైన ఎన్టీఆర్

కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. రమా రాజమౌళితో కలిసి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 హాజరైన అతిథులు

హాజరైన అతిథులు

జపూర్ సమీపంలోని కుకాస్ టౌన్‌లో ఎస్ఎస్ కార్తికేయ-పూజా ప్రసాద్ పెళ్లి వేడుక జరిగే ప్రాంతం ఇదే. వేడుకకు హాజరైన అతిథులను రాజమౌళి కుటుంబ సభ్యులు సాదరంగా రిసీవ్ చేసుకున్నారు.

రాజమౌళి మూవీ స్టార్స్

రాజమౌళి మూవీ స్టార్స్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని పెళ్లి సెబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు రెండు రోజుల ముందుగానే జైపూర్ వెళ్లడం విశేషం.

ముందే చేరుకున్న రాజమౌళి

ముందే చేరుకున్న రాజమౌళి

అతిథుల కంటే ముందే రాజమౌళి అండ్ ఫ్యామిలీ కుకాస్‌లో పెళ్లి వేడుక జరిగే ఫైవ్ స్టార్ హోటల్‌కు చేరుకున్నారు.

 కార్తికేయ, పూజా

కార్తికేయ, పూజా

కాక్తికేయ గతంలో బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకత్వం, సినీ ప్రొడక్షన్ తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఇక పూజా సింగర్‌గా రాణిస్తున్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు. వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ మొత్తం హాజరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ప్రభాస్

ప్రభాస్

రాజమౌళికి అత్యంత సన్నిహితుల్లో ప్రభాస్ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి ప్రాజెక్టు ఇండియన్ సినీ చరిత్రలో ఓ సంచలనం. బాహుబలి సినిమాకు పని చేసిన ఎస్ఎస్ కార్తికేయతో కూడా ప్రభాస్‌కు మంచి అనుబంధం ఉంది. కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ప్రభాస్ జైపూర్ చేరుకున్నారు.

అనుష్క

అనుష్క

కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు హీరోయిన్ అనుష్క కూడా జైపూర్ చేరుకున్నారు. ‘భాగమతి' తర్వాత చాలా కాలం అనుష్క మీడియాకు చిక్కలేదు. కార్తికేయ పెళ్లి వేడుకకు హాజరవుతూ ఆమె ఫోటో గ్రాఫర్ల కంటపడ్డారు.

 అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున

కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు జైపూర్ సమీపంలోని కుకాస్ ఏరియాలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు టాలీవుడ్ మన్మదుడు అక్కినేని నాగార్జున కూడా విచ్చేశారు.

 ఫ్యామిలీతో కలిసి హాజరైన రామ్ చరణ్

ఫ్యామిలీతో కలిసి హాజరైన రామ్ చరణ్

కార్తికేయ పెళ్లి వేడుక జరిగే ఫైవ్ స్టార్ హోటల్‌కు తన భార్య ఉపాసనతో కలిసి చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

సుష్మితా సేన్

సుష్మితా సేన్

కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తన కూతురుతో కలిసి హాజరయ్యారు. జైపూర్ ఎయిర్ పోర్టులో ఆమె మీడియాకు అభివాదం చేస్తూ వెళ్లారు.

 ఎన్టీఆర్, రానా

ఎన్టీఆర్, రానా

కార్తికేయ పెళ్లి వేడుక జరిగే ఫైవ్ స్టార్ హోటల్‌ ప్రాంగణంలో టాలీవుడ్ స్టార్స్ జూ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి సందడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X