కార్తికేయ వెడ్డింగ్: రమ-రాజమౌళి డాన్స్, ప్రభాస్ ఎన్టీఆర్, చరణ్ దుమ్మురేపారు.. ఉపాసన అదుర్స్!
రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ వెడ్డింగ్ సెల్రేషన్ జైపూర్లో వైభవంగా జరుగుతోంది. పెళ్లి వేడుక కోసం ఇక్కడి కుకాస్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్ మూడు రోజుల పాటు బుక్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని, నాగార్జున, అనుష్క లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు.
వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా శనివారం సంగీత్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి తన భార్య రమతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి డాన్స్ చేస్తూ సూపర్ ఫన్ క్రియేట్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో
‘ఎట్టాగ ఉంటాది ఓ అమ్మి... ఏటేటో అవుతాది చిన్నమ్మి' అనే పాటకు రమ-రాజమౌళి అదిరిపోయే స్టెప్స్ వేశారు.
ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ దుమ్మురేపారు
ఇక ఈ పెళ్లి వేడుకలో సందడి మొత్తం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లదే కావడం కావడం విశేషం. ఈ ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్స్ రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. తమ ఫ్యామిలీ పెళ్లి వేడుక జరిగితే ఎలా సందడి చేస్తారో అంతకంటే ఎక్కువ సందడే చేశారు.
నాగార్జున, ఎన్టీఆర్ డాన్స్
హలో బ్రదర్ చిత్రంలోని పాటకు నాగార్జున, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయడం సంగీత్ వేడుకలో హైలెట్ అయింది.
ఉపాసన అదరగొట్టింది
ఈ వేడుకలో ఎంఎం కీరవాణి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన తన సమాధానాలతో అదరగొట్టారు. కీరవాణి ఏం అడిగారు, ఉపాసన ఏ సమాధానం చెప్పారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఉపాసన, రామ్ చరణ్
జైపూర్లో జరుగుతున్న రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుకలో రామ్ చరణ్, ఉపాసన.
చరణ్-ఎన్టీఆర్ ఫోటో షేర్ చేసిన ఉపాసన
ఈ రోజు జరిగే పెళ్లి వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా... ఈ ఫోటోను స్వయంగా ఉపాసనప తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేయడం విశేషం.

రానా, రామ్ చరణ్
ఎస్ఎస్ కార్తికేయ పెళ్లి వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి,
ఉపాసన, లక్ష్మి ప్రణతి
పెళ్లి వేడుకలో డైట్ పాటించడం లేదు. వంటకాలు నోరూరిస్తున్నాయి అని ట్వీట్ చేసిన ఉపాసన... ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు.
అడవి శేష్
ఎస్ఎస్ కార్తికేయ పెళ్లి వేడుకలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్.

కార్తికేయ-పూజా
ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె పూజాను కార్తికేయ పెళ్లాడుతున్నారు.


Click it and Unblock the Notifications











