twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఇంట్లో పెళ్లి భాజాలు: ఎస్ఎస్ కార్తికేయ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

    |

    Recommended Video

    Rajamouli's son Karthikeya's Marriage Date Got Fixed | Filmibeat Telugu

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగ బోతున్నాయి. ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహానికి ముహూర్థం ఫిక్స్ అయింది. పూజా అనే అమ్మాయిని కార్తికేయ పరిణయమాడబోతున్నాడు.

    పూజా మరెవరో కాదు... ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె. సెప్టెంబర్ మాసంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

    పెళ్లి డేట్ ఎప్పుడంటే?

    పెళ్లి డేట్ ఎప్పుడంటే?

    జనవరి 5, 2019న పూజ-కార్తికేయ వివాహం జరుగబోతోంది. ఆల్రెడీ రాజమౌళి ఫ్యామిలీలో పెళ్లికి సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం వారు పెళ్లి షాపింగ్, శుభలేఖలు పంచే పనిలో బిజీగా ఉన్నారట.

    ప్రేమ వివాహం

    ప్రేమ వివాహం

    కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్లో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు అఖిల్ అక్కినేని కూడా హాజరైన సంగతి తెలిసిందే.

    రామానాయుడు స్టూడియోలో

    రామానాయుడు స్టూడియోలో

    వీరి పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి ఇక్కడ వేడుక ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం.

    ఎస్ఎస్ కార్తికేయ

    ఎస్ఎస్ కార్తికేయ

    కాక్తికేయ గతంలో బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకత్వం, సినీ ప్రొడక్షన్ తన కెరీర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    పూజా సింగర్‌గా

    పూజా సింగర్‌గా

    ఇక పూజా సింగర్‌గా రాణిస్తున్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు. వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ మొత్తం హాజరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

    English summary
    Director Rajamouli's son Karthikeya is all set to tie the knot soon. Karthikeya wedding with pooja has been locked on the 5th of January 2019. The wedding will be held at Ramanaidu Studios in Nanakramguda at 6.30 pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X