Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి ఇంట్లో పెళ్లి భాజాలు: ఎస్ఎస్ కార్తికేయ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
Recommended Video
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగ బోతున్నాయి. ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహానికి ముహూర్థం ఫిక్స్ అయింది. పూజా అనే అమ్మాయిని కార్తికేయ పరిణయమాడబోతున్నాడు.
పూజా మరెవరో కాదు... ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె. సెప్టెంబర్ మాసంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
పెళ్లి డేట్ ఎప్పుడంటే?
జనవరి 5, 2019న పూజ-కార్తికేయ వివాహం జరుగబోతోంది. ఆల్రెడీ రాజమౌళి ఫ్యామిలీలో పెళ్లికి సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం వారు పెళ్లి షాపింగ్, శుభలేఖలు పంచే పనిలో బిజీగా ఉన్నారట.
ప్రేమ వివాహం
కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌లో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు అఖిల్ అక్కినేని కూడా హాజరైన సంగతి తెలిసిందే.
రామానాయుడు స్టూడియోలో
వీరి పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి ఇక్కడ వేడుక ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం.
ఎస్ఎస్ కార్తికేయ
కాక్తికేయ గతంలో బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకత్వం, సినీ ప్రొడక్షన్ తన కెరీర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
పూజా సింగర్‌గా
ఇక పూజా సింగర్‌గా రాణిస్తున్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు. వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ మొత్తం హాజరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.