»   » అవేమీ ఊహించలేదంటూ రాజమౌళి

అవేమీ ఊహించలేదంటూ రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సోషల్ మీడియా నుంచి మంచి సహకారం అందుతోంది. అందరూ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తమ దైన శైలిలో చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతూ పబ్లిసిటీ కు సహకరిస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి ఆనందంతో స్పందించారు. ఆయన ఏమన్నారో స్వయంగా ట్వీట్లలో చూడండి.


నాకు గొప్ప మద్దతుగా నిలుస్తున్న ట్విట్టర్ స్నేహితులందరికీ పెద్ద ధాంక్స్. నిర్మహమాటంగా చెప్పాలంటే బాహుబలికి ఇంత భారీ స్ధాయిలో ఆదరణ దక్కుతుందని కానీ, ఆరంభంలో వచ్చిన విమర్శలను కానీ అసలు ఊహించలేదు. ఐతే ప్రపంచవ్యాప్తంగా అన్ని వైపుల నుంచీ మాపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. మా ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. మా టీమ్ అందరితరుపునా అందరికీ ధాంక్స్. ఎందరో సెలబ్రెటీలు బాహుబలి గురించి మంచి మాటలు చెప్పారు. వారిందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.మరో ప్రక్క ఈ చిత్రం రిలీజైన రోజు తెలుగు,తమిళ, హిందీ ల నుంచి మిక్సెడ్ రివ్యూలు వచ్చాయి. ఎమోషన్ కంటెంట్ మిస్తైందని చాలా రివ్యూలలో వచ్చింది. విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నా...సినిమా ఎక్సపెక్టేషన్స్ రీచ్ కాలేదని అన్నారు. ఈ నేపధ్యంలో రాజమౌళి రివ్యూ రైటర్స్ ని ప్రక్కన పెట్టి...తన అభిమానులు లేదా సినిమా ప్రియుల నుంచి రివ్యూలు ఆహ్వానిస్తున్నారు. మీరు ఇప్పటికే బాహుబలి చూసి ఉంటే రివ్యూ రాయవచ్చు అని చెప్తున్నారు. దానికి సంభందించిన వీడియోని రాజమౌళి మాటల్లో ..ఇక్కడ చూడండి...ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.


కలెక్షన్స్ విషయానికి వస్తే...


తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.


Rajamouli's thanks for response

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.


ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.


English summary
rajamouli ss ‏ tweeted: "A big thank you to all my Twitter friends for your great patronage. To be very frank I neither expected this BIG a support nor the initial"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu