»   » బజాజ్ స్కూటర్ పై రాజమౌళి (ఎర్లీ యంగ్ డేస్ ఫొటో)

బజాజ్ స్కూటర్ పై రాజమౌళి (ఎర్లీ యంగ్ డేస్ ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో నెంబర్ వన్ దర్సకుడుగా ఎదిగిన రాజమౌళి ...యువకుడుగా అంటే బాగా కుర్రాడుగా ఉండేటప్పుడు ఎలా ఉండేవారు అంటే ఇదిగో ఈ ఫొటోలో లాగ ఉండేవారు. బజాజ్ స్కూటర్ పై కూర్చున్న వ్యక్తే రాజమౌళి. ఆ ప్రక్కన నిలబడ్డ వ్యక్తి రాజమౌళి స్నేహితుడు శ్రీను. రాజమౌళి గారి వెనక కూర్చున్నది సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి. అలాగే రాజమౌళి గారి ఎదురుగా నిలబడింది...మాత్రం రచయిత కాంచి గారు. ఆ రోజుల నాటి ఈ ఫొటోని కళ్యాణ్ కోడూరి తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ పేజిలో షేర్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజమౌళి తాజా చిత్రం విషయానకి వస్తే...

ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి'. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. చిత్రం ప్రారంభం నుంచి అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు.

 Rajamouli's young days photo

మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. ఈ చిత్రం ఏప్రియల్ 17 న విడుదల అవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు వాయిదా పడిందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల బాహుబలి.. మే 2015 లో వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో సాబుసిరిల్‌ రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రభాస్‌, తమన్నాలపై పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని వేసవిలో విడుదల చేస్తారు. ఇది కాకుండా మరో పాట చిత్రీకరిస్తే తొలి భాగం పూర్తవుతుంది.

ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
Music Director Kalyan Koduri shared photo of his young days with Rajamouli and Kanchi.
Please Wait while comments are loading...