»   » ‘మెగా’ పొరపాటు....సారీ చెప్పిన రాజమౌళి

‘మెగా’ పొరపాటు....సారీ చెప్పిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న శిల్పకళా వేదికలో జరిగిన 'అల్లుడు శీను' ఆడియో వేడుకలో రాజమౌళి మాటల్లో కొన్ని పొరపాట్లు దొర్లిన సంగతి తెలిసిందే. చిరంజీవితో స్టాలిన్ సినిమాకు కూడా వినాయక్ అంతకష్టపడి ఉండడని అల్లుడు శీను సినిమాను ఉద్దేశించి రాజమౌళి వ్యాఖ్యానించారు. కానీ వాస్తవం ఏమిటంటే చిరంజీవి-వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'ఠాగూర్'.

తన మాటల్లో పొరపాటు దొర్లడంపై రాజమౌళి అపాలజీ చెప్పారు. ఠాగూర్ అని చెప్పబోయి స్టాలిన్ అని పలికానని తన ఫేస్ బుక్ పేజీలో పోస్టింగ్ లో వివరణ ఇచ్చారు. అపాలజీ చెప్పడం ద్వారా రాజమౌళి తన గ్రేట్ ఆటిట్యూడ్ చాటుకున్నారని పలువురు అభిమానులు అభిప్రాయ పడుతుండటం గమనార్హం.

 Rajamouli said Apologie

రాజమౌళి సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

English summary
"Apologies.. I said Stalin instead of Tagore yesterday in Alludu Seenu audio launch" Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu