twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు హ్యాండిచ్చిన రాజమౌళి!

    By Sindhu
    |

    'మగధీర" చిత్రంతో తెలుగు చలన చరిత్ర రికార్డులను సష్టించిన దర్శకధీర రాజమౌళి, మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సుముఖంగా లేడని అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయడానికి సిద్దంగా లేడని వార్తలు వస్తున్నాయి. అశ్వనీదత్ వైజయంతీ బ్యానర్ లో చేయబోతున్న జగదేకవీరుడు-అతిలోకసుందరి సీక్వెల్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టమని రాజమౌళిని కోరితే అందుకు రాజమౌళి ప్రస్తుతం 'మర్యాదరామన్న" చిత్రంతో పాటు ప్రభాస్ తో మరో చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. దయచేసి మీరు మరో డైరక్టర్ ని చూసుకోమని చెప్పాడట.

    అలాగే ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించనున్న 'దానవీరశూరకర్ణ" చిత్రానికి కూడా రాజమౌళిని సంప్రదిస్తే వారికి కూడా ఇదే మాట రాజమౌళి చెప్పాడని విశ్శసనీయ వర్గాల సమాచారం. అయినా రాజమౌళి సినిమా కమిట్ అయ్యాడంటే..ఆ చిత్రాన్ని సుమారు ఒక సంవత్సరం పాటు రూపొందిస్తాడని తెలుసుకదా? మరి రెండు చిత్రాలకు కమిట్ అయిన రాజమౌళిని ఈ చిత్రాలను చేయాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు ఆగాల్సిందే..మరి అంతకాలం కళ్యాణ్ రామ్, అశ్వనీదత్ లు వెయిట్ చేస్తారో లేక మరో దర్శకుడితో ముగించేస్తారో వేచి చూడాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X