బ్యాడ్‌బాయ్ అంటున్న రాజమౌళి... అనుష్కతో డేటింగ్‌పై గుచ్చిగుచ్చి, ప్రభాస్ చెప్పేది అబద్దమా?

Recommended Video

Koffee With Karan : Baahubali Team - Promo | Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ టాక్ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ స్టార్లను తన షోకు పిలిపించి వారి నుంచి ఆసక్తికర సమాధానాలు, ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు.

త్వరలో ఈ షోలో 'బాహుబలి' త్రయం రాజమౌళి, ప్రభాస్, రానా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షో షూట్ చేయగా వచ్చే ఆదివారం దీన్ని ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రభాస్ బ్యాడ్ బోయ్ అంటూ రాజమౌళి పంచ్

ప్రభాస్ బ్యాడ్ బోయ్ అంటూ రాజమౌళి పంచ్

ప్రభాస్, రానాలో బ్యాడ్ బాయ్ ఎవరు? అంటూ రాజమౌళిని కరణ్ జోహార్ ప్రశ్నించగా.... ఆయన నుంచి ‘ప్రభాస్' అంటూ రిప్లై వచ్చింది. అయితే ప్రభాస్‌లోని బ్యాడ్ బాయ్‌ని కనిపెట్టడం అంత ఈజీ కాదని చెప్పారు జక్కన్న. రానా కల్పించుకుని... ‘నేనెప్పుడూ దొరికిపోతుంటాను' సమాధానం ఇచ్చారు.

 నువ్వు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదా?

నువ్వు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదా?

‘ప్రభాస్... నువ్వు ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదా''... అని కరణ్ జోహార్ ప్రశ్నింగా ‘లేదు' అని సమాధానం ఇచ్చాడు. అయితే ప్రభాస్‌ను అంత ఈజీగా వదలిపెట్టలేదు కరణ్ జోహార్ అతడి నుంచి ఏదో ఒకరకంగా అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేశాడు.

అనుష్కతో డేటింగ్‌పై గుచ్చిగుచ్చి అడిగితే ప్రభాస్ రియాక్షన్ ఇదీ

అనుష్కతో డేటింగ్‌పై గుచ్చిగుచ్చి అడిగితే ప్రభాస్ రియాక్షన్ ఇదీ

నువ్వేమో ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అంటున్నావు. కానీ అందరూ ప్రభాస్-అనుష్క డేటింగులో ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. అవి నిజమా?కాదా? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా... ‘‘మీరే ఇలాంటివి మొదలు పెట్టారు'' అని రిప్లై ఇచ్చారు.

ఇద్దరూ సింగిల్

ఇద్దరూ సింగిల్

మీరిద్దరూ సింగిల్‌గానే ఉన్నారా? అనే ప్రశ్నకు ప్రభాస్, రానా రియాక్ట్ అవుతూ..... ‘అవును' అన్నారు. ఈ ఇద్దరి నుంచి ఇలాంటి సమాధానం విని కరణ్ జోహార్ ఆశ్చర్యపోయారు.

అబద్దం చెబుతున్నారా?

అబద్దం చెబుతున్నారా?

మీరు ఇక్కడ నేను అడిగే ప్రశ్నలకు అబద్దం చెబుతున్నారా? అనే ప్రశ్నకు ప్రభాస్ ‘అవును' అనే సమాధానం ఇచ్చినట్లు ప్రోమో చూస్తే స్పష్టం అవుతోంది. అయితే పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే తప్ప ... కాఫీ విత్ కరణ్ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా చెప్పిన విషయాలపై ఓ క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X