»   » బాలకృష్ణకు ధాంక్స్ చెప్పిన రాజమౌళి

బాలకృష్ణకు ధాంక్స్ చెప్పిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తన ట్విట్టర్ పేజీ ద్వారా హీరో నందమూరి బాలకృష్ణకు ధాంక్స్ తెలియచేసారు. ఆయన ధాంక్స్ చెప్పటానికి కారణం...ఆడియో పంక్షన్ తిరుపతిలో జరగటానికి ఫర్మిషన్ ఇప్పించినందుకు. ఆయన స్టేజిపై ఈ విషయం చెప్పటం ఇడియట్ లాగ మరిచానంటూ ట్వీట్ చేసారు. ఆయన ఏం ట్వీట్ చేసారో...మీరు చదవండి...


'బాహుబలి' ఆడియో వేడుక నిన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. మే 31న జరగాల్సిన ఈ ఆడియో పంక్షన్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో 'బాహుబలి' ఎదురుచూపులు కొనసాగాయి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Rajamouli say thanks to Balakrishna

ఎట్టకేలకు శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి వేంకటేశుని సాక్షిగా, ఆయన సన్నిధి తిరుపతిలో పాటల పండుగు కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. అభిమానులంతా ఆనందోత్సాహాలతో ఈ పంక్షన్ ని ఎంజాయ్ చేసారు.


'బాహుబలి' గురించి ఎన్నో కబుర్లు బయటకు వచ్చాయి. 'బాహుబలి' కోసం మూడేళ్ల పాటు పాటుపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాపై పెదవి విప్పారు. ''రాజమౌళి లాంటి వ్యక్తిని నేనింత వరకూ చూళ్లేదు. ఇక చూడను కూడా. నేను ఆయన అభిమాని. నేనెంత పెద్ద అభిమానినో ఆయనకు తెలీదు'' అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.


English summary
ssrajamouli tweeted:" like an idiot I forgot to mention one person who helped us to get the permission in the first place. I thank Nandamuri Balakrishna garu from The bottom of my heart and on behalf of our entire unit.
Please Wait while comments are loading...