మహేష్ ప్యాన్స్ కు రాజమౌళి ఓపెన్ ఆఫర్
మహేష్ అభిమానులుకు ప్రముఖ దర్సకుడు రాజమౌళి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తనతో చేయటానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఎలాంటి చిత్రం కావాలో కోరుకోమన్నారు. ఈ విషయాన్ని ఆయన బిజినెస్ మ్యాన్ ఆడియో పంక్షన్ వేదిక పై ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ...మహేష్, నేను కలిసి సినిమా చేయాలని కమిటైపోయాం. కౌబాయ్, జేమ్స్‌బాండ్ తరహా కావాలో లేక అల్లూరి సీతారామరాజులాంటి సినిమా చేయాలో అభిమానులే నిర్ణయించాలి అన్నారు. అలాగే ...రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది అన్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం ఫినిషింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం అనంతరం ప్రబాస్ తో చేయబోయే చిత్రం ఉంది. ఆ తర్వాత మహేష్ తో ఓకే అయిన ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. మరి ఆయన అన్నట్లు కౌబాయ్, జేమ్స్‌బాండ్ తరహా కావాలో లేక అల్లూరి సీతారామరాజులాంటి చిత్రం చేస్తారో చూడాలి. ఆయన యాక్షన్ డైరక్టర్ గా చేసిన రాజన్న చిత్రం నిన్న గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











