చిరంజీవి లాంటి వారితో చేయను: రాజమౌళి
చిరంజీవి లాంటి వాళ్లతో సినిమాలు చేయనని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తేల్చి చెప్పారు. ఈగ చిత్రం సక్సెస్ టూర్లో భాగంగా రాజమౌళి బుధవారం వరంగల్, కరీంనగర్లలో ఈగ టీంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి లాంటి పెద్ద హీరోలకు డైరెక్షన్ చేయనని, భవిష్యత్‌లో నాని లాంటి చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాపై రాష్ట్ర ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, మీరు దర్శకత్వం వహిస్తారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి కదా.... అని మీడియా అడిగిన ప్రశ్నకుపై విధంగా స్పందించారు రాజమౌళి. అయితే చిరంజీవి అడిగితే 150వ చిత్రానికి స్ర్కిప్టు అందిస్తానని స్పష్టం చేశారు. మరి రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ను చిరంజీవి ఎలా ఉపయోగించుకుంటారో..
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం రూపొందించిన గ్రాఫికల్ వండర్ చిత్రం'ఈగ' జులై 6న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. స్టోరీ ముందే చెప్పిన రాజమౌళి ప్రేక్షకులు ఆశ్చర్య పడేలా సినిమాను తెరక్కించారు.
ఈగ సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా చెన్నయ్, బెంగుళూరుల్లో కూడా ఈగ సక్సెస్‌ను సెలబ్రేట్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











