twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజమౌళి క్షమాపణ(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. అయితే ఎందుకు చెప్పా ల్సి వచ్చిందీ అంటే... ఆయన వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేసారు. గత నాలుగైదు నెలలుగా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న ‘బాహుబలి' చిత్ర టీం దీపావళి సందర్భంగా బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని విడుదల చేసారు. ఈ రోజు నుంచి యధావిధిగా షూటింగ్ జరగనుంది. ఆ వీడియో మీరూ చూడండి.

    స్పెషల్ వీడియో ద్వారా ఇలా తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ ఫ్యాన్స్ కి క్షమాపణ కూడా చెప్పారు.

    ‘ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. ఎందుకంటే మీ హీరోని 2 సంవత్సరాలుగా మీకు దూరం చేసేసాను. ఒక పెద్ద సినిమా అందించాలనే ఉద్దేశంతో ఇంత ఆలస్యం అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కోపాన్ని మరిచిపోతారని ఆశిస్తున్నాను. మొదట్లో ప్రతి నటీనటుల బర్త్ డే కి కొన్ని వీడియోలని రిలీజ్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నామని' రాజమౌళి తెలిపారు.

    Rajamouli says sorry to Prabhas fans

    ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి'. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మన ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగాన్ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

    ఇక ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు అందరి దృష్టీ 'బాహుబలి'పైనే. ఈ సినిమా కోసం ప్రభాస్‌ చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. 'బాహుబలి' కోసమే భారీగా బరువు పెంచాడు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలూ, కసరత్తులూ... ఇలా చెమటోడ్చాడు. అసలే తెలుగు హీమాన్‌లా ఉంటాడు. దానికి రాజమౌళి తరహా శిక్షణ తోడైంది. అందుకే రెండు చేతుల్లోనూ ఆయుధాలు అందుకొన్న ప్రభాస్‌ ఛాయాచిత్రాన్ని చూడగానే నిజమైన యుద్ధవీరుడు దిగొచ్చాడేమో అనిపించింది. 2015లో ప్రధమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    SS Rajamouli has apologised to hero Prabhas fans for not releasing any video on the eve of the Young Rebel Star's birthday. Wishing all the Telugu people happy Diwali, Rajamouli posted a video in Facebook and said sorry to Prabhas fans, also cited the reasons for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X