»   » గుణశేఖర్ చేస్తున్నారు అని ప్రక్కన పెట్టా : రాజమౌళి

గుణశేఖర్ చేస్తున్నారు అని ప్రక్కన పెట్టా : రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాకతీయ సామ్రాజ్యంపై సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా. గుణశేఖర్‌గారు రుద్రమదేవి తీద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నారని తెలిసింది. ఆ ఆలోచననీ పక్కన పెట్టేశా. ఆ క్రమంలోనే ముందు చెప్పిన కేరక్టర్లతో నాన్నగారు లైన్‌ అల్లడం ప్రారంభించారు. ఇక ‘బాహుబలి' తీద్దామని నిర్ణయించుకున్నా అని రాజమౌళి అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే... ‘బాహుబలి' మొదలు పెట్టక ముందు కృష్ణదేవరాయలపై తీద్దామని చాలా రోజులు కూర్చున్నా. ఆటైమ్‌లో ఆ కథతో రాఘవేంద్రరావుగారు, బాలకృష్ణగారు సినిమా చేస్తారనేది బయటకొచ్చింది. రాఘవేంద్రరావుగారు నన్ను పిలిచి, ‘నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను' అన్నారు. ఆయన అనుకుంటున్నప్పుడు నేను చేయడమెందుకని ఆగిపోయా అని చెప్పుకొచ్చారు రాజమౌళి.


Rajamouli says that he want to make Rudrama Devi

బాహుబలి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎస్.రాజామౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వెనుక ఆయన రెండేళ్ల కృషి, తపన దాగి ఉంది.


ఓ యజ్ఞంలా భావించి బాహుబలి చిత్రాన్ని వెండితెర దృశ్యమానం చేస్తున్నారాయన. ప్రతి సన్నివేశాన్ని ఓ శిల్పంలా తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారీ దర్శక బాహుబలి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎస్.ఎస్.రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.


ప్రభాస్ నటన గురించి చెప్తూ.... ప్రభాస్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాడు. సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రభాస్‌తో నాకు మంచి అనుబంధముంది. నిజజీవితంలో కూడా మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే తీరుగా ఉంటాయి.


బాహుబలి పాత్రను చాలా ప్రేమించి చేశాడు. తన క్యారెక్టర్ మాత్రమే కాకుండా అన్ని పాత్రలు సరిగా రావాలని నిరంతరం తపించాడు. ఏ సన్నివేశంలో ఎలా ఉండాలి? ఆ సన్నివేశానికి తగినట్లుగా ఉండే భావోద్వేగాలేంటి? అని ఎప్పుడు ఆలోచిస్తూనే గడిపాడు. అతడి కష్టం వల్ల నేను పెద్దగా హోమ్‌వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అన్నారు.

English summary
SS Rajamouli’s Baahubali is one of the most awaited films of 2015. This movie is hitting the headlines ever since the shooting was started.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu