SSRMB: రాజమౌళి వేట మొదలైంది..మహేష్ బాబు కోసం జక్కన్నకు ఎన్ని కష్టాలో!
Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను హీరోలు పెట్టి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ కీర్తిని సంపాదించుకున్నారు. కేవలం స్టార్ హీరోలనే కాదు ఓ కామెడియన్ కూడా కథనాయకుడిగా మారి.. హిట్ కొట్టగల సత్తా రాజమౌళికి మాత్రమే ఉంది. అంటే.. ఆయన ప్రతి సీన్ లో బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నిస్తుంటారు. అలా.. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ SSMB 29 కోసం రాజమౌళి వేట మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ను ఇస్టా లో పోస్ట్ చేశారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం SSMB 29 భారీ బడ్డెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR)లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. అలాగే.. ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ తగ్గట్టుగానే ఈ సినిమాను గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కన్నారట.

అడ్వెంచర్ థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు వేచించనున్నారట. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. పీరియడ్ డ్రామాగా 18 శతాబ్దంలో జరిగే కథ అని, ఈ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందనీ, ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్టూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నారట. ఈ తరుణంలో వందలాది జూనియర్స్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే.. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమా (SSMB 29 )కోసం మహేశ్ బాబు కూడా చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఫ్యాన్స్ కే కాదు.. మీడియా కు దొరకడం మానేశాడు మహేశ్ బాబు. కానీ ఇటీవల మీడియా కంటబడిన సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లూక్ లో కనిపించారు. రాజమౌళి మూవీ కోసం మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించారు. మొదటి సారిగా ప్రిన్స్ మహేశ్ బాబును అలా చూసే సరికి ఫ్యాన్ ఆగలేకపోతున్నారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.

హీరో మహేష్ బాబునే ఆ రేంజ్ లో ఫోకస్ చేస్తుంటే.. డైరెక్టర్ రాజమౌళి అంతకు మించి అనేలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం SSMB29 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నాడు రాజమౌళి. ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్ కోసం.. కెన్యా దేశంలోని అంబోసెలీ నేషనల్ పార్క్‌ను సందర్శించాడు.

ఈ తరుణంలో మూవీ షూటింగ్ కోసం.. ఎడారిలో తిరుగుతున్నట్లు ఓ ఫొటో షేర్ చేశారు రాజమౌళి. పైగా.. "కనుగొనుకోవడానికి తిరుగుతున్నా (Trotting to Discover)" అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ SSMB29 మూవీ లోకేషన్స్ సెర్చ్ చేయడానికే అక్కడికి వెళ్లారంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











