హీరో సూర్య కోసం తనవంతు బాధ్యతగా రాజమౌళి!

By Bojja Kumar

హైదరాబాద్: డబ్బు సమస్యతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులకు విద్యను అందించడమే లక్ష్యంగా అకుంటిత దీక్ష బూనిన హీరో సూర్య తన స్థాపించిన 'ఆగారం ఫౌండేషన్' ద్వారా తన ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ... 'డబ్బు లేక చదువుకు దూరం అవుతున్న వారికి ఆగారం ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయదలుచుకున్నాం. 9841091000కు ఫోన్ చేయండి అని తెలిపారు. ఈకార్యక్రమం గురించి అందరికీ తెలియజేయండి' అని ప్రకటించారు.

సూర్య చేపట్టిన ఆ మంచి పనికి తన వంతు బాధ్యతగా....అతని సందేశాన్ని తన ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు రాజమౌళి. ఈ విషయం ఎక్కువ మందికి తెలియడం ద్వారా పేద విద్యారులకు మంచి చేసిన వారం అవుతామనేది రాజమౌళి భావనగా కనిపిస్తోంది.

ఆ విషయం పక్కన పెడితే...
అన్నీ కుదిరితే టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి మరియు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలిసి ఓ ద్విభాషా చిత్రం చెయ్యాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే చెన్నైలో సూర్యని రాజమౌళి కలవడంతో సూర్యతో సినిమా చేస్తున్నాడని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు ప్రచారం చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన 'నాన్ ఈ' చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాదించింది. ఈ స్టార్ డైరెక్టర్ తమిళంలో సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్యనే రాజమౌళి - సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి సినిమా చేయనున్నారు అనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ పుకార్లను రాజమౌళి కొట్టి పారేశారు. కానీ భవిష్యత్తులో సూర్యతో సినిమా చేస్తాను అనే విత్తనాన్ని మాత్రం ప్రేక్షకుల మదిలో నాటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X