రాజమౌళి చిత్రం గురించి వాడి వేడిగా చర్చలు వారికి ఫలించేనా..!
వరస విజయాల సంచలనదర్శకుడు రాజమౌళి ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రామానాయుడు స్టుడియోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొత్తం 120 పని రోజులు షూటింగ్ నిమిత్తం కేటాయించినట్టు తెలిసింది. ఇంతకు ముందు కనీ వినీ ఎరగని రీతిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ జోడించి ఓ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నాడు.
తమిళ తెలుగు బాషలలో ఒకేసారి రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తమిళ హక్కులు 5 కోట్లకు అమ్ముడు పోయి విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. అలాగే హిందీ సిని రంగంలో కుడా ఈ సినిమా అనువాద హక్కుల గురించి వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. నాని, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయకుడు గా కనిపించనున్నాడు.
గత జన్మలో హత్యకు గురై ఈగ గా పుట్టిన వ్యక్తి తన హత్యకు కారణమైన విలన్ ఫై పగ తీర్చుకోవడం ప్రదానంశం గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా, సెంథిల్ కుమార్ కెమెరా బాద్యతలు నిర్వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











